F3: 100 రోజుల్లో 100 పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి : వెంకటేష్

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. మే 27న విడుద‌లైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. తొలి వీకెండ్ ఈ చిత్రం అద్భుతంగా కలెక్ట్ చేసింది. రూ.35 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.50 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

 

ఆయన మాట్లాడుతూ… “నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నాను.మాకు బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చారు. నేను మాట‌ల్లో చెప్ప‌లేను. ఈ సినిమా షూటింగ్ జ‌రిగిన 100 రోజుల్లోనూ 100 పాజిటివ్ వైబ్రేష‌న్స్ కనిపించాయి. ప్ర‌తీ సీన్ చేసేట‌ప్పుడు ఎంక‌రేజ్మెంట్ వండ‌ర్‌ఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమా రిలీజ్ అయ్యాక అది మరింత వండ‌ర్‌ఫుల్ గా అనిపిస్తుంది.ఇది రియ‌ల్ టీమ్ వ‌ర్క్.

- Advertisement -

ఎఫ్‌2 త‌ర్వాత ఎఫ్‌3 చేశారంటే ప్ర‌తి ఒక్క‌రూ సొంత సినిమాగా భావించి చేశారు. ప్రేక్ష‌కులు… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేట‌ర్‌ కు వ‌స్తున్నారు.అది మాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. నా అభిమానులు థియేట‌ర్‌ లో న‌న్ను చూసి 3 ఏళ్ళు అయ్యింది. నా సినిమా చూసి మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్న ఇండ‌స్ట్రీలోని వారందరికీ కూడా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. అంద‌రికీ వెరీవెరీ థ్యాంక్స్” అంటూ చెప్పుకొచ్చారు వెంకటేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు