Chay: నాగ చైతన్య ఫ్యాన్స్ ను నిరాశపరిచిన ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్..!

2018 లో విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తర్వాత అమీర్ ఖాన్ నుండీ మరో చిత్రం వచ్చి 4 ఏళ్ళు కావస్తోంది.త్వరలో ఆయన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1994లో వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమాకి రీమేక్. చిన్నప్పటి నుండీ అంగవైకల్యం కలిగిన ఓ పిల్లాడు… తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో జీవితంలో రాష్ట్రపతి పతకం తీసుకునే వరకు ఎలా ఎదిగాడు అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆమిర్ స్నేహితుడిగా అతను కనిపించాడు. నాగ చైతన్య లుక్ ను ఎప్పుడో రివీల్ చేశారు. కానీ ట్రైలర్ లో చైతన్య రెండు, మూడు షాట్స్ లో మాత్రమే కనిపించడంతో అభిమానులు నిరాశ చెందారు.ఒకవేళ సినిమాలో కనుక చైతన్య పాత్ర మరింత తక్కువగా ఉంటే అభిమానులు మరింతగా నిరాశచెందే అవకాశం లేకపోలేదు.తెలుగులో కూడా ఈ మూవీ డబ్ అవుతుంది.నాగ చైతన్య కోసమే ఈ చిత్రాన్ని బయ్యర్స్ ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు