ఏ స్టార్ హీరో వారసుడికైనా తన సినిమా రిలీజ్ అయితే ఒపెనింగ్స్ మాత్రమే వస్తాయి. అలానే ఆ సినిమా హిట్ అయితేనే, ఆ హీరో లో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. నందమూరి వంశం నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన ప్రస్తుతానికి ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ ఫుల్ గా నిలబడగలిగాడు.
అక్కినేని వారసుడు అఖిల్ కు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” సినిమా వరకు హిట్ లేదు, సూపర్ స్టార్ మహేష్ బాబు ట్యాగ్ తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు కి కూడా “సమ్మోహనం” సినిమా వరకు సరైన హిట్ లేదు. ఇప్పుడు వీళ్ళ సినిమాలు వచ్చిన ఆడియన్స్ అంతంత మాత్రంగానే థియేటర్స్ కి వస్తారు.
కానీ మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మాత్రం గట్టిగ నిలబడ్డాడు. చాలా విమర్శలను దాటి, విమర్శించిన వాళ్ళ నుండే ప్రశంసలు అందుకున్నాడు. బాలీవుడ్ లో చరణ్ “జంజీర్” సినిమా రిలీజ్ అయినప్పుడు తన గురించి బ్యాడ్ గా రాసినవాళ్ళే ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత చరణ్ ను ఆకాశానికి ఎత్తేసారు. చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అంటే “మగధీర” “రంగస్థలం” “ఆర్ఆర్ఆర్” అని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ పక్కన తన ముందు సినిమాలను మించిన స్థాయిలో నటించి ఆడియన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక ప్రోపర్ సినిమా పడితే చూడాలనేది చాలామంది అభిప్రాయం. ఇప్పుడు అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. RC18 సినిమాను రాజమౌళి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.