వరుస హిట్ సినిమాలు చేసి తమ స్థాయిని పెంచుకుంటారు కొందరు దర్శకులు, కానీ వీటికి భిన్నంగా ఎస్ ఎస్ రాజమౌళి వరుస హిట్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఒక ఎమోషన్ పట్టుకుని ప్రేక్షకులలో కళ్ళలో నీళ్ళు తెప్పించాలన్న, ఒక మాస్ ఎలివేషన్ సీన్ తో ఈలలు వేయించాలన్న అది రాజమౌళికే సాధ్యం.
ప్రేక్షకుడి అంచలనాలను అవలీలగా అందుకోవడం ఈయనకు బాగా తెలుసు. వరుస హిట్ సినిమాలు చేసిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయ్. ఇప్పటివరకు రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ లాంటి వాళ్ళను స్టార్ హీరోస్ ను చేసారు. కానీ స్టార్ హీరోలతో వర్క్ చెయ్యలేదు. మొదటిసారి ఒక స్టార్ హీరోను డీల్ చెయ్యబోతున్నారు.
SSMB29 ను చేయబోతున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ కి సరిపడా విలన్ వెతికే పనిలో పడ్డాడట. ఈ సినిమాలో రెండు స్ట్రాంగ్ విలన్ కేరక్టర్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్ లో వినిపిస్తుంది. దీనికోసం తమిళ్ హీరో కార్తీతో పాటు అలానే ఇంకో బాలీవుడ్ యాక్టర్ ను కూడా ఫిక్స్ చేయనున్నారు జక్కన. రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే ఇంకో భారీ సినిమాకి శ్రీకారం చుడుతున్నట్లే అనిపిస్తుంది.