ఇది తెలుగు సినిమా. ఇది తమిళ సినిమా. ఇది కన్నడ సినిమా అంటూ ఉండే కట్టుబాట్లను తొలిగిపోయి, ఇది సౌత్ సినిమా అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. సౌత్ నుండి వచ్చే అన్నీ సినిమాలను ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. కంటెంట్ నచ్చితే, ఆ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. సినిమాలతో పాటు హీరోలను కూడా భాషతో సంబంధం లేకుండా గౌరవిస్తున్నారు. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి సౌత్ హీరోలు ముందుకు వస్తున్నారు.
“రెమో” “శక్తి” “వరుణ్ డాక్టర్” “డాన్” సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. శివకార్తికేయన్ తో పాటు తాజాగా మరో కోలీవుడ్ హీరో కూడా తెలుగులో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.
అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినిమా చేయనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ సినిమాను తెరకెక్కించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
“యుగానికి ఒక్కడు” “కాష్మోరా” “ఖాకీ” “ఖైదీ” సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న కార్తీ, ఈ మూవీతో మరింత ఫ్యాన్ బేస్ పెరిగే అవకాశముంది.