F4 : సీక్వెల్ పై అనుమానాలేన్నో..?

కామెడీ మంత్రను నమ్ముకున్న అనిల్ రావిపూడి సక్సస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఎఫ్ 3 సినిమాతో ఈ డైరెక్టర్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. మూడన్నర ఏళ్ల క్రితం వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ, థియేటర్స్ లో సినీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు.

అయితే ఈ మూవీ అంచనాలకు మించి రాణిస్తుండటంతో దీని సీక్వెల్ పై ప్రేక్షకులకు అప్పుడే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఎఫ్ 3కి సీక్వెల్ ఎఫ్ 4 ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్ పై కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఎఫ్ 2 లో ఉన్న క్యారెక్టర్స్ నే ఎఫ్ 3 లో కొనసాగించిన అనిల్ రావిపూడి, ఎఫ్ 4 లో మాత్రం అలా కాకుండా, కొత్త క్యారెక్టర్స్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ పెరగడంతో, బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుందని ఈ నిర్ణయానికి వచ్చారని, దిల్ రాజు సన్నితవర్గాల నుండి సమాచారం. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

కానీ, హీరోలను మార్చితే, సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం కూడా ఉందని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీని ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎఫ్ 4లో ఈ పాత్రలు లేకుంటే, నిరాశ తప్పదని మూవీ క్రిటిక్స్ కూడా హెచ్చరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు