Anil Raavipudi: గురి తప్పని అర్జునుడు

కొందరి ఆలోచనలు ఆకాశాన్ని అంటుతాయి
కొందరి ఊహలు లోకాలను దాటుతాయి
కొందరు నేలమీద నుండి ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం మొదలుపెడతారు. వాడికి తెలుస్తుంది మన చుట్టూ ఉన్నవాడి జీవితానికి ఏమి ఇవ్వాలని. అది కొంచెం ఆనందం అయితే చాలు అని అనిల్ రావిపూడి నమ్మాడు. అదే పంథాలో సినిమాలో చేసుకుంటూ తన కెరియర్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు.

ఎక్కడో ఉన్న హాలీవుడ్ ను అందుకోవాలి అనేది కొందరి దర్శకుల ప్రయత్నం, థియేటర్ లో ఆడియన్ మనసును అందుకుంటే చాలు అనేది అనిల్ రావిపూడి నమ్మకం. వాస్తవానికి అనిల్ రావిపూడి చేసినవి బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు, టాక్ బస్టర్ సినిమాలు అని చెప్పొచ్చు.

ఒకప్పటితో పోలిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి రావడం చాలా తగ్గించేసారు. ఒకప్పుడు మనం సినిమాకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు సినిమానే మన ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే 4 వారలు లేట్ అవుతుంది అంతే. “F2” సినిమా రిలీజ్ అయినప్పుడు సంక్రాంతి సీజన్ కదా ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేసేసారు, ఇప్పుడు “F3” సినిమాకి అంత సీన్ లేదులే అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. దానికి తోడు ట్రైలర్ చూసి కూడా చాలామంది పెదవి విరిచారు. అదే కుళ్ళు జోకులు అనే విమర్శలు కూడా వచ్చాయి, దానికి తోడు బుకింగ్స్ కూడా సాధాసీదాగానే జరిగాయి. కానీ వీటన్నిటిని “F3” తారుమారు చేస్తూ మంచి టాక్ తో దూసుకెళ్లిపోతుంది. ఎవరికీ ఈ సినిమా రీచ్ అవుతుంది అనిల్ బలంగా నమ్మాడో, వాళ్ళే ఈ సినిమాకి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు