హీరోలకు అభిమానులు ఉండటం కామన్. గట్టిగా మాట్లాడితే ఒక హీరో అభిమానులు వేరే హీరోను ట్రోల్ చేయడం కూడా కామన్. సోషల్ మీడియా లేని రోజుల్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ట్విట్టర్ వేదికగా ఆ హీరోను ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. దానికి హీరోలు రియాక్ట్ కాకపోయినా, ఆ హీరో అభిమానులు మాత్రం గట్టిగా రియాక్ట్ అయి అటాక్ కౌంటర్ వేస్తున్నారు.
రీసెంట్ గా రిలీజైన F3 సినిమాకి ముందు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తారని దిల్ రాజ్ ఒక పబ్లిక్ గానే అనౌన్స్ చేసారు.
దీనిని విన్న పవన్ అభిమానులకి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. తీరా సినిమా చూసాకా దిల్ రాజు గారు చెప్పిన అసలు విషయం అర్ధమైంది. పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగు స్టార్స్ అంతా వెండితెరపై కనిపించడం ప్రేక్షకులకు కొంత ఆనందాన్ని ఇచ్చిన విషయమే. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.
ఈ సినిమా కథలో భాగంగా తమన్నా కొంతమేరకు మగవేషంలో కనిపిస్తుంది. అది కొంతమందికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మిల్కి బ్యూటీ ను అలా చూడటం కూడా చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని పట్టుకుని దిల్ రాజు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన భలే కనిపించారు అంటూ పవన్ ను కార్నర్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నాన్ మెగా ఫ్యాన్స్. తమన్నా గెటప్ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో పక్క పక్కన పెట్టి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ మింగుడు పడటం లేదు. దీంతో ట్విట్టర్ లో రెండు ఫ్యాన్స్ గ్రూప్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది.