Tarakaratna: మరోసారి విలన్ గా

ఒక సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్.
ఎందుకంటే ఒకరిని హీరోగా చూపించాలి అంటే ఇంకొకరిని విలన్ గా చూపించాల్సిందే. కొన్ని సినిమాల్లో విలన్స్ భయపెడతారు, తమ క్రూరత్వాన్ని చూపిస్తారు. ఇంకొన్ని సినిమాల్లో విలన్స్ కామెడీ కూడా చేస్తారు. అదే త్రివిక్రమ్ సినిమా విలన్స్ అయితే ప్రాసతో కూడిన ఫిలాసఫీ కూడా చెప్తారు.

కొన్ని సినిమాలు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా,
ఆ సినిమాలో కొన్ని కేరక్టర్స్ మాత్రం అలా మనలను వెంటాడుతాయి
రవిబాబు దర్శకత్వం వహించిన “అమరావతి” సినిమాలో తారక రత్న కేరక్టర్ కూడా అలాంటిదే. ఆ సినిమాలో “తారక్ రత్న” విలన్ గా భయపెట్టిన తీరు ఇప్పటికి ఎవరు మరువలేనిది. హీరోగా పది సినిమాలు పైగా చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందని చెప్పొచ్చు.

ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో తారకరత్న విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయ్. దీనికి కారణం వీళ్ళ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు నిరాశపర్చినా, టెలివిజన్ లో ఈ సినిమాలు మంచి టీఆర్పీ ను తీసుకొస్తాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలక్షన్స్ రాబడుతున్నాయి, మరి ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ ఈసారైనా బాక్స్ అఫ్ ఆఫీస్ వద్ద ప్రూవ్ చేసుకుంటారేమో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు