Srinidhi Shetty : ఏంటి ఒక్క సినిమాకే..

సౌత్ లో రోజు రోజుకు హీరోయిన్స్ కు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఒక్క సినిమా హిట్ పడితే చాలు, రెమ్యునరేషన్ విషయం ఏ మాత్రం తగ్గడమే కాకుండా, అమాంతం పెంచేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా తమ లేెవెల్ కు తగ్గట్టు పారితోషికం పెంచుతున్నారు. దీనికి తోడు.. మెయింటెనెన్స్ ఛార్జ్ లు అధనం.

ఇటీవల నట్టికుమార్ అనే నిర్మాత కూడా తన కష్టాన్ని మీడియా ముందే వెళ్లగక్కాడు. “ ఒక సినిమా చేసిన హీరోయిన్ కూడా 2 కోట్లు అడుగుతుంది. సౌందర్య లాంటి గొప్ప హీరోయిన్స్ అప్పట్లో 25 లక్షలు నుండి 30 లక్షలకు మించి తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు 3 కోట్లు, పైగా బాడీ గార్డులు, చార్టెర్డ్ ఫ్లైట్స్ కూడా ఇస్తున్నారు “ అంటూ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నిజమే అనిపిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, తర్వాత సినిమాలకు భారీగా రెమ్మునరేషన్ డిమాండ్ చేస్తుందట. సౌత్ హీరోయిన్స్ తో సమానంగా తనకు పారితోషికం ఇవ్వాలని నిర్మాతలకు చెబుతుందని సమాచారం.

- Advertisement -

తెలుగు సినిమా కోసం ఇటీవల ఓ నిర్మాత శ్రీనిధి శెట్టిని సంప్రదించగా 2 నుండి 3 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఆ నిర్మాత ముక్కున వేలేసుకుని, అక్కడి నుండి వచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక్క సినిమాకే ఇంత డిమాండ్ ఏంటని చాలా మంది సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు