Raviteja : రెమ్యూనరేషన్ కోసం సినిమాను ఆపేసిన స్టార్ హీరో

ఒకప్పుడు రవితేజ పారితోషికం విషయంలో నిర్మాతలకి అందుబాటులో ఉండే వాడు. అయితే ‘రాజా ది గ్రేట్’ చిత్రం నుండీ ‘డిస్కో రాజా’ వరకు ఆయన ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ వచ్చాడు. రూ.50 కోట్ల మార్కెట్ ఉన్న హీరో కాబట్టి.. నిర్మాతలు ఓకె చెప్పారు. కాకపోతే ఆ సినిమాలు అన్నీ ప్లాపులయ్యాయి. దాంతో ‘క్రాక్’ సినిమాని రూ.5 కోట్లకే చేశాడు. ఆ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో రవితేజ మళ్ళీ పారితోషికం పెంచేస్తూ వచ్చాడు. కథ, దర్శకుడు విషయం తర్వాత. ముందు పారితోషికం నచ్చితే సినిమా ఓకె చేసేయడం మొదలుపెట్టాడు. ‘ఖిలాడి’ మూవీతో పాటు అన్నీ అలా ఒప్పుకున్నవే.

త్వరలో విడుదల కావాల్సిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా అంతే. ఈ సినిమా చాల వరకు కంప్లీట్ అయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు, రెండు పాటలు పూర్తవ్వాలి. కానీ అవి ఆగిపోయాయి. ఇందుకు కారణం రవితేజకి రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉండడం. తన పారితోషికం పూర్తిగా ఇస్తేనే సినిమా కంప్లీట్ చేస్తాను లేదంటే లేదు అంటూ తెగేసి చెబుతున్నాడట రవితేజ. మరో పక్క నిర్మాతకి బిజినెస్ కూడా అవ్వడం లేదు. అతని బ్యానర్లో తీసిన సినిమాలు ఏమీ హిట్ అవ్వలేదు. బిజినెస్ అయ్యాక ఇస్తాను అని చెప్పినా రవితేజ వినడం లేదట. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవ్వడం వలన జూన్ 17న విడుదల కావాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు