Custody: కృతి శెట్టి కెరీర్ ఆ సినిమాతో డిసైడ్ అవుతుందా..? 

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి అందానికి ఫిదా అయిన తెలుగు ఆడియెన్స్ ఒక సినిమాతోనే ఓన్ చేసుకున్నారు. అయితే, కృతి నటించిన తరవాతి సినిమాల్లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం వల్ల మెల్లిగా అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం నాగచైతన్య సరసన కృతి నటించిన కస్టడీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న కృతి కెరీర్ కి కస్టడీ సినిమా కీలకంగా మారింది. కస్టడీ మినహా తెలుగు సినిమాలు కృతి చేతిలో లేవు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితేనే కృతికి తదుపరి తెలుగు సినిమా ఆఫర్లు వచ్చే పరిస్థితి నెలకొంది.

వెంకట్ ప్రభు డైరెక్షన్లో వస్తున్న కస్టడీ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వెంకట్ ప్రభు సినిమాలంటే కథలో కొత్తదనం ఉంటుంది అన్న పేరుంది. ఈ క్రమంలో అరవింద్ స్వామి, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ హై స్పీడ్ లో చేస్తోంది సినిమా యూనిట్.

గ్లామర్ పరంగా టాప్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని ఫీచర్స్ ఉన్న కృతి శెట్టి సరైన హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే, యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన కస్టడీ సినిమాలో కృతికి ఏ మాత్రం స్కోప్ ఉంటుంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగచైతన్య, కృతిల జంట ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. మళ్ళీ ఇప్పుడు కస్టడీ ద్వారా రెండోసారి వీస్తుండటంతో, ఈసారైనా ఆశించిన స్థాయిలో అలరిస్తారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. మరి, కృతికి కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిన కస్టడీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు