Directors Day: దాసరి – లెజెండ్ ఫర్ ఏ రీజన్…!

మే 4న లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు జయంతి సందర్బంగా డైరెక్టర్స్ డే జరుపుకుంటుంది సినీ పరిశ్రమ. ఈ నేపథ్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలికి, సినీ పరిశ్రమ దార్శనికుడికి ఫిల్మిఫై అక్షర సుమాంజలి సమర్పిస్తోంది. 150సినిమాలకు దర్శకత్వం వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఈ చిరస్మరణీయుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘తాత – మనవడు’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన దాసరి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించి టాలీవుడ్లో కమర్షియల్ సినిమా పంధాలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా నటుడిగా కూడా తన సత్తా చాటారు.

సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాజ్యసభ సభ్యుడిగా, బొగ్గు గనుల శాఖ మంత్రిగా తన సేవలందించారు. సినీపరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించటానికి దాసరి ముందుండే వారు. అందుకే, సినీ పరిశ్రమ పెద్ద దిక్కుగా భావించేవారు ఈయనని. దాసరి సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం, అవినీతిపై పోరాటం, కుటుంబ విలువలు వంటి అంశాలు కూడా ప్రధానంగా ఉండేవి. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన దాసరి ఈ తరం దర్శకులకు ఆదర్శనీయం అని చెప్పాలి.

టాలీవుడ్ ని ముందుండి నడిపించిన దాసరి లేని లోటు తీర్చలేనిది. సినీ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన ఆయన కృషి మరువలేనిది. జీవితాంతం సినిమానే శ్వాసగా భావించిన దాసరి భారత రత్న అవార్డుకి అన్ని రకాలుగా అర్హుడు అని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. దర్శక రత్న జీవితం దర్శకుడు అన్న పదానికి నిర్వచనం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ మహామనిషి జీవితం నుండి భావి తరాలు స్ఫూర్తి పొందాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు