Allu Arjun: బన్నీ సినిమాలో ‘గోల్డెన్ లెగ్ బ్యూటీ’..!

సంయుక్త మీనన్, ప్రస్తుతం టాలీవుడ్లో వరుస హిట్స్ తో దూసుకుపోతూ గోల్డెన్ లెగ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలు వరుసగా హిట్ అవటంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్త మరో క్రేజీ ఆఫర్ అందుకుందని సమాచారం అందుతోంది. పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తరవాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంయుక్త మీనన్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.

విరూపాక్ష సినిమాలో సంయుక్త నటనకు మంచి ప్రశంసలు దక్కాయి, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో సంయుక్త నటన సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఈ క్రమంలో బన్నీ సినిమాలో ఛాన్స్ సంపాదించిన సంయుక్త త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారటం ఖాయం అని అనిపిస్తుంది. సినిమాల్లో నటనతోనే కాకుండా ప్రమోషన్స్ సమయంలో తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తోందీ మలయాళీ భామ. ఇదిలా ఉండగా, సంయుక్త మీనన్ కి వరుస ఆఫర్లు రావటం వెనక దర్శకుడు త్రివిక్రమ్ హస్తం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించటంతో పాటు ఆ సినిమాకు అన్నీ తానై వ్యవహరించటం, సార్ సినిమా వ్యవహారాల్లో కూడా త్రివిక్రమ్ కీలకంగా వ్యవహరించటం, ఆ రెండు సినిమాల్లో సంయుక్త హీరోయిన్ అవ్వటం, ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న బన్నీ సినిమాలో కూడా సంయుక్తని హీరోయిన్ గా కన్ఫార్మ్ చేయటం ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు