National Crush: క్రేజీ ప్రాజెక్ట్స్ తో రష్మిక జోరు..!

ఛలో సినిమా ద్వారా తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు పొంది టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది కన్నడ భామ రష్మిక. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక ని అభిమానులు నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో, నితిన్ వెంకీ కుడుముల సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక బాలీవుడ్ లో సైతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరెక్షన్లో రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది.

అంతే కాకుండా విక్కీ కౌశల్ సరసన ‘చావా’ సినిమాలో కూడా నటిస్తోంది. చావా సినిమాలో రష్మిక క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన సమాచారం అందుతోంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న చావా సినిమాలో రష్మిక మహారాణి పాత్రలో నటిస్తోందని సమాచారం. ఈ సినిమాతో రష్మిక రేంజ్ మరింత పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకే పరిమితమైన రష్మిక ఇక నుండి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వరుసగా బాలీవుడ్ సినిమాలను సైన్ చేస్తున్న రష్మిక ఇక ముంబైకి మార్చుతుందా అన్న ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. చాలా మంది టాలీవుడ్ హీరొయిన్లు ఇక్కడ టాప్ ప్లేస్ లో ఉండగా బాలీవుడ్ సినిమాల మోజులో పడి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. రష్మిక కూడా ఆ జాబితాలో చేరకుండా అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ని బ్యాలెన్స్ చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు