Vindhya Vishaka: లేడీ యాంకర్స్ పై ఫైర్.. జబర్దస్త్ యాంకర్సే టార్గెట్..!

Vindhya Vishaka.. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక్కొక్క యాంకర్ ఒక్కో ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ ఉంటారు.. అయితే కొంతమంది యాంకర్స్ మాట్లాడుతూ ఉంటే అలాగే వారిని చూడాలనిపిస్తుంది.. వారు మాట్లాడినంత సేపు ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది.. అయితే మరి కొంతమంది యాంకర్స్ మాట్లాడితే… అబ్బా వీరెప్పుడు ఆపేస్తార్రా బాబూ అంటూ తలలు పట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి.. ఈ మధ్యకాలంలో కొంతమంది లేడీ యాంకర్స్ మరీ ముఖ్యంగా కాంట్రవర్సీలకు గురి అవుతున్నారు. ప్రత్యేకించి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడే మాటలు అప్పటికప్పుడు కొంతమందిని ఆకట్టుకున్నా.. చాలామందికి ఇవి ఇబ్బందికరంగా మారుతున్నాయి.. ఈ క్రమంలోనే సీనియర్ లేడీ యాంకర్స్ అలాగే యంగ్ లేడీ యాంకర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ యాంకర్ వింధ్య విశాఖ..

Vindhya Vishaka: Fire on Lady Anchors..is there no sence..
Vindhya Vishaka: Fire on Lady Anchors..is there no sence..

లేడీ యాంకర్స్ పై ఫైర్..

వింధ్య విశాఖ మాట్లాడుతూ.. సుమక్క అంటే నాకు ఎంతో ఇష్టం.. ఆమెను కలిసిన ప్రతిసారి మాకు కూడా కొన్ని షోలు విడిచి పెట్టొచ్చు కదా అంటూ సరదాగా అక్కను ఆటపట్టిస్తూ ఉంటాము.. ముఖ్యంగా సుమక్క టైమింగ్స్ సూపర్.. ఉదయభాను అక్క అయితే చాలా చక్కగా ఆకట్టుకుంటుంది.. ఎన్నో సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేస్తున్నారు.. ఇక ఝాన్సీ విషయానికి వస్తే.. సమాజం పట్ల ఆమెకి ఎంతో నాలెడ్జ్ ఉంది.. అలాంటి వారితో ఎంతసేపు మాట్లాడితే అన్ని విషయాలు నేర్చుకోవచ్చు ..అయితే వీరిని పక్కన పెడితే ఇంకొంతమంది లేడీ యాంకర్స్ ఉన్నారు.. వారు ఏం మాట్లాడతారో వారికే తెలియదు.. పైగా తెలుగు కూడా సరిగ్గా రాదు.. ఒకరకంగా చెప్పాలి అంటే వాళ్ళు యాంకరింగ్ ని బ్రష్టు పట్టిస్తున్నారు.. మరీ ముఖ్యంగా కొన్ని షోలలో బూతులు,డబుల్ మీనింగ్ డైలాగులతో అలాంటి కామెడీని జనాలకి అలవాటు చేస్తున్నారా అనిపిస్తుంది అంటూ వింధ్య ఆగ్రహం వ్యక్తం చేసింది

జబర్దస్త్ యాంకర్స్ గురించేనా..

ముఖ్యంగా ఈమె చెప్పిన కామెంట్లను బట్టి చూస్తే జబర్దస్త్ షో అందులోని యాంకర్స్ గురించి వింధ్య కామెంట్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. మొత్తానికి అయితే వింధ్య విశాఖ చేసిన కామెంట్లు జబర్దస్త్ యాంకర్స్ ని ఉద్దేశించి చేసినవి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

వింధ్య విశాఖ కెరియర్.

ఈమె అసలు పేరు వింధ్య విశాఖ మేడపాటి …టెలివిజన్ వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకుంది ..అంతే కాదు వీడియో జాకీగా, మోడల్గా కూడా వ్యవహరించింది వింధ్య.. తెలుగులో స్పోర్ట్స్ ప్రెసెంటర్ గా కూడా పేరుపొందింది.. అంతేకాదు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ తో తెలుగులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన తొలి మహిళగా కూడా పేరు సొంతం చేసుకుంది వింధ్య. 2019 క్రికెట్ ప్రపంచ కప్ వంటి టోర్నమెంట్లకు యాంకర్ గా పనిచేసిన ఈమె స్వేచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తోంది. అలాగే సినిమా అవార్డ్స్ , ఫిలింఫేర్ అవార్డ్స్ , సంతోషం సినీ అవార్డ్స్, జీ కుటుంబం అవార్డ్స్ ని, జీ సినీ అవార్డ్స్ 2017 వంటి అవార్డు ఫంక్షన్లకు కూడా యాంకర్ గా పనిచేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు