Senior Actress Annapoornamma: అన్నపూర్ణమ్మ లవ్, కండిషన్స్… అప్పట్లో లవ్ లెటర్ లో ఆమె భర్త ఏం రాశారో తెలుసా?

Senior Actress Annapoornamma : సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలనాడు హీరోయిన్ గా నటించి మెప్పించిన అన్నపూర్ణమ్మ ప్రస్తుతం అమ్మ నుంచి అమ్మమ్మ పాత్రల దాకా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే సినిమాలలో తప్ప బయట ఎక్కడా ఎక్కువగా కనిపించని అన్నపూర్ణమ్మ ప్రేమ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అప్పట్లోనే ఆవిడ ప్రేమ వివాహం చేసుకోగా, తన భర్త రాసిన ప్రేమలేఖ గురించి ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ స్వయంగా వెల్లడించారు. మరి ఇంతకీ ఆ లవ్ లెటర్ లో ఏముంది? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై లుక్కేస్తే…

అన్నపూర్ణమ్మ సినిమాల్లోకి రావడానికంటే ముందే నాటకాల్లో నటించేవారు. అయితే అప్పట్లోనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆవిడ వెంట పడేవారట కొంతమంది. ఒకతనైతే ఏకంగా నువ్వు కట్నం లాంటివి ఏవి తేకపోయినా సరే నిన్నే పెళ్ళాడతాను అని పట్టు పట్టాడట. దాదాపు నెలరోజుల పాటు అలాగే తిరిగాడట అతను. కానీ తను పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత అతను ఏమయ్యాడో తెలియలేదట.

ఇక అలా నాటకాలు వేసుకుంటున్నప్పుడే ఓసారి తన భర్తను చూశారట అన్నపూర్ణమ్మ. అప్పటికి ఆయన ఎవరో తెలియకపోయినా స్టేజ్ పై నాటకం వేసేటప్పుడే అతను తనను చూశాడని, తను కూడా అతని చూశానని చెప్పుకొచ్చింది. ముందే రాసి పెట్టి ఉండడం వల్ల ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నామని, వీడెవడు ఇలా చూస్తున్నాడు అని లైట్ తీసుకుని వెళ్ళిపోయాను అని గుర్తు చేసుకుంది ఈ సీనియర్ నటి.

- Advertisement -

ఆ తర్వాత ఆయన స్వయంగా ఓ లెటర్ రాసాడని, అందులో తన పేరు వివరాలతో పాటు తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుందని తెలుపుతూ తన శాలరీ డీటెయిల్స్ కూడా చెప్పేశాడట. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే అవును లేదా కాదు అని ఈ కింద ఇచ్చిన అడ్రస్ కి లెటర్ రాయండి. లేదంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి అంటూ తన భర్త అప్పట్లో లెటర్ రాశారట.

ఇక ఆ తర్వాత అన్నపూర్ణమ్మ తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని ఇంట్లో చెప్పేసిందట. ఆమె తల్లి ఓకే అనడంతో అదే విషయాన్ని అప్పట్లో తన భర్తకు చెప్పడమే కాకుండా రెండు కండిషన్స్ పెట్టారట అన్నపూర్ణమ్మ.

తాను కచ్చితంగా పెళ్లయ్యాక కూడా నాటకాల్లో నటిస్తాను అని, దాంట్లో వచ్చిన ఒక్క రూపాయిని కూడా నీకు ఇవ్వను… నా కుటుంబాన్ని చూసుకోవడానికి ఖర్చు చేస్తాను అని ముఖం మీదే చెప్పేశారట. అయితే అప్పట్లో ఆయన ఈవిడ కండిషన్స్ కు ఓకే చెప్పి మరీ పెళ్లి చేసుకున్నారట.

ఇక ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ రాగా, ఆయన రెండు మూడుసార్లు మానేయమని గొడవ పడ్డారట. అయితే అన్నపూర్ణమ్మ కావాలనుకుంటే నీకు నచ్చినట్టుగా ఇంటి పట్టున ఉండే అమ్మాయిని చూసుకుని వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చానని, అంతేతప్ప సినిమాల్లో నటించేది మాత్రం మానుకోను అని ఖరాఖండిగా చెప్పిందట. అన్నపూర్ణమ్మ ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు