Fahad Faasil : హాలీవుడ్ సినిమాకి ఫహాద్ ఆడిషన్… సెలెక్ట్ అయ్యాడా అంటే…

Fahad Faasil : సిల్వర్ స్క్రీన్ పై మెరవడం, స్టార్ డం, పాపులారిటీ సంపాదించడం అనేది నటీనటులందరికీ ఉండే కోరిక. అయితే ఒక్కసారి రీజనల్ సినిమాలో దాన్ని అధిగమించారు అంటే ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ లో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక అది కూడా పూర్తయితే ఆ తర్వాతే హాలీవుడ్ పై కన్నుపడుతుంది. కానీ హాలీవుడ్ అందర్నీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించదు. అక్కడ నటించడానికి అతి కొద్ది మందికి మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కు రీసెంట్ గా హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

ఫహాద్ కు హాలీవుడ్ నుంచి పిలుపు

ఓ హాలీవుడ్ సినిమాకు ఇటీవల ఆడిషన్ కు హాజరైన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు ఫహాద్. ఆయన సినిమా పేరు, ప్రొడక్షన్ హౌస్ పేరు వెల్లడించినప్పటికీ మిగతా విషయాలను మాత్రం చెప్పుకొచ్చారు. తను ఆడిషన్ లో నటించడానికి హాలీవుడ్ మేకర్స్ ఓ సీన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఈ స్టార్ హీరో. అయితే నిజానికి ఫహద్ కు తను చేసే సన్నివేశం కథాంశం లేదా సందర్భం గురించి క్లారిటీ అవసరమట. అప్పుడే ఆయన నట విశ్వరూపం బయట పడుతుందని అంటున్నారు ఆయన సన్నిహిత వర్గాలు. కానీ హాలీవుడ్ వాళ్ళు మాత్రం కేవలం ఒక సీన్ ఇచ్చి నటించమని అడిగారట. మరి ఆయన అడిషన్లో సెలెక్ట్ అయ్యారా ? ఆ హాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టేనా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ హీరో.

ఫహాద్ సినిమాల విషయానికి వస్తే…

రీసెంట్ గా ఆవేశం అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఫహాద్. నస్లీన్, మమిత నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ ప్రేమలు మూవీ సీక్వెల్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే మహేష్ నారాయణ నెక్స్ట్ మూవీలో మమ్ముట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. భాషలు, జానర్ లతో సంబంధం లేకుండా మల్టీ టాలెంట్ ను ప్రదర్శిస్తూ పాన్ ఇండియా సినిమాల్లో కీలకపాత్రలను పోషిస్తున్నారు ఫహద్. ప్రస్తుతం పుష్ప 2 మూవీలో ఈ హీరో విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇండియన్ స్టార్స్ వీళ్లే…

సౌత్ ఇండస్ట్రీలో హాలీవుడ్ లో సినిమా చేసిన యాక్టర్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పొచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ 1998లో బ్లడ్ స్టోన్ అనే ఇండో అమెరికన్ మూవీలో నటించారు. ఇక ధనుష్ గ్రే మ్యాన్ అనే మూవీతో పాటు ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ అనే సినిమాల్లో నటించాడు. అలాగే నెపోలియన్ అనే తమిళనాడు డెవిల్స్ నైట్ అనే ఇంగ్షీషు మూవీలో నటించాడు. జీవి ప్రకాష్ కూడా ఓ హాలీవుడ్ సినిమాలో మెరిశాడు. విశ్వరూపం సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ కూడా హాలీవుడ్ సినిమాలో నటించి మెప్పించింది. వీళ్లతో పాటు నార్త్ నుంచి ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్, దీపికా పదుకొనే, టబూ, దేవ్ పటేల్, శోభిత ధూళిపాళ్ల వంటి నటులు హాలీవుడ్లో మెరిసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు