Kriti Sanon : కృతి సనన్ షాకింగ్ డెసిషన్…ఆ విషయంలో ప్రూవ్ చేసుకోవడానికేనట

Kriti Sanon : ఇటీవల క్రూ మూవీతో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్న బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తాజాగా తన నెక్స్ట్ సినిమాల విషయంలో షాకింగ్ తీసుకుంది. స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అభిమానులను విశేషం. ఇంతకీ సినిమాల విషయంలో కృతి తీసుకున్న నిర్ణయం ఏంటి? అంటే…

టాలీవుడ్ లో నో లక్..

టాలీవుడ్ లో ఈ బ్యూటీకి పెద్దగా కలిసి రాలేదు కాని బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది కృతి. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే అనే మూవీలో నటించింది ఈ చిన్నది. అయితే ఆ మూవీ పెద్దగా ఆడక పోవడంతో టాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్లు రాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది కృతి. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ అనే సినిమాలో నటించింది. అందులో సీతగా ఆమె పాత్ర ఆకట్టుకున్నప్పటికీ సినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి కృతికి చేదు అనుభవం ఎదురయింది. ఇలా తెలుగులో బ్యాడ్ లక్ వెంటాడుతుంటే హిందీలో మాత్రం వరుస ఆఫర్లతో పాటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటోంది కృతి సనన్.

రీసెంట్ గా కరీనా కపూర్, టబుతో కలిసి క్రూ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెస్ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక త్వరలోనే కృతి సనన్ దో పత్తి అనే సినిమాతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఆమెతో పాటే కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా శశాంక చతుర్వేది తెరకెక్కిస్తున్నారు. బ్లూ ఫిలిం బటర్ ఫ్లైట్ ఫిలిమ్స్ పథకంపై కృతి నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. అంటే ఈ మూవీతో ఇప్పటిదాకా హీరోయిన్ గా అలరించిన కృతి నిర్మాతగా మారబోతుందన్నమాట.

- Advertisement -

విలన్ గా చేయాలని..

అయితే దో పత్తి మూవీ థియేటర్లలో కాకుండా త్వరలోనే ఓటిటిలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే కృతి తన మనసులోని మాటను బయట పెట్టింది. ఈ సినిమా కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను అంటూనే తన చెల్లితో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పటిదాకా లవ్ స్టోరీలు, కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి నుంచి పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమాల్లో నటించాలని ఉందంటూ వెల్లడించింది శృతి. కొన్ని సినిమాల్లో యాక్షన్ పాత్రలు చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో లేవని, ఇక దీంతోపాటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇప్పటినుంచి విలన్ గా నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అంటూ మేకర్స్ కు కొత్త ఆలోచనలు తెప్పిస్తోంది కృతి సనన్. మరి ఈ బ్యూటీని తెరపై విలన్ గా చూపించడానికి ఏ మేకర్ ముందుకు వస్తాడో చూడాలి.

Sourcerew

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు