Vijayendra Prasad: రవితేజ ను ఎవరు మ్యాచ్ చెయ్యలేదు

కొన్ని సినిమాలు కొందరికోసమే పుడతాయి అనేటట్లు ఉంటాయి. ఒక సినిమాను చూసినప్పుడు, ఆ సినిమా మనకు విపరీతంగా నచ్చినప్పుడు, ఆ సినిమాలో ఈ నటుడు తప్ప ఇంకొకరు చేయలేరు అని అభిప్రాయం మనకు కలుగుతుంది. అలా చాలా తక్కువ సినిమాలకు మాత్రమే జరుగుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు.

ఇప్పటివరకు ఎస్.ఎస్ రాజమౌళి చాలా సినిమాలను తెరకెక్కించారు. రాజమౌళి తీసిన ప్రతి సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలానే రాజమౌళి సినిమాలు వేటికవి ప్రత్యేకమని చెప్పొచ్చు. కేవలం యాక్షన్ ఫిలిమ్స్ కాకుండా కామెడీ జోనర్ లో కూడా సినిమాలను చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఎస్.ఎస్ రాజమౌళి కెరియర్ లో గుర్తుండిపోయే చాలా సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి అని చెప్పొచ్చు.

రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజను డ్యూయల్ రోల్ లో చూపించి అద్భుతమైన పర్ఫామెన్స్ ను రవితేజ నుంచి రాబట్టగలిగాడు రాజమౌళి. అయితే విక్రమార్కుడు సినిమాలోని అత్తిలి సత్తి క్యారెక్టర్ ఎంతగా నవ్వించిందో, అలానే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఒక పవర్ఫుల్ పోలీస్ అంటే ఎలా ఉంటాడు అనడానికి నిదర్శనం ఆ రోల్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే ఒక భాషలో హిట్ అయిన సినిమాని వేర్వేరు భాషల్లో రీమిక్ చేయటం అనేది కామన్ గా జరిగేదే. అయితే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా ఇంకో భాషలో తీస్తున్నప్పుడు దానిని అదే రకంగా తెరకెక్కిస్తారు. కానీ అదే లెవెల్ పర్ఫామెన్స్ యాక్టర్లు ఇస్తారు అని నమ్మకం చాలామందికి ఉండదు. మహేష్ బాబు చేసిన చాలా సినిమాలు తమిళ్ లో విజయ్ రీమిక్ చేశాడు. కానీ మహేష్ బాబు ఇచ్చిన లెవెల్ పర్ఫామెన్స్ విజయ్ ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అలా అని విజయ్ తక్కువని కాదు కానీ కొన్ని పర్ఫామెన్స్ కి కొందరు మాత్రమే షూట్ అవుతారు అనేది చెప్పొచ్చు.

ఇకపోతే విక్రమార్కుడు సినిమా కూడా తమిళ్ కన్నడ హిందీ తో పాటు చాలా భాషల్లో కూడా రీమేక్ అయింది. అయితే కొన్ని భాషల్లో సినిమా హిట్ అయి కలెక్షన్స్ వచ్చినా కూడా రవితేజ పర్ఫామెన్స్ ని ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. ఇదే విషయాన్ని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ చాలా సినిమాలను రీమేక్ చేశారు. పవన్ చేసిన కొన్ని సినిమాలు రీమేక్ సినిమాలు కూడా ఒరిజినల్ కంటే కూడా చాలా బాగున్నాయి అనేటట్లు ఉంటాయి. పవన్ చేసిన ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఖుషి ఒరిజినల్ చూసినప్పుడు మాత్రం మనకి ఆ ఫీల్ రాదు ఎందుకంటే అంతలా దాన్ని డామినేట్ చేసి ఇన్వాల్వ్ అయి నటించాడు పవన్ కళ్యాణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు