Shivratri – Special Shows : శివరాత్రికి రీ రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా సూపర్ హిట్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్. అయితే కొన్ని సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకొన్ని సినిమాలును పట్టించుకోవడం మానేశారు. ఇకపోతే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా చాలా సినిమాలను ఇప్పుడున్న యూత్ థియేటర్లో చూడటం మిస్ అయ్యారు అని చెప్పొచ్చు. అందుకోసమే అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే పవన్ కళ్యాణ్ తమ్ముడు, జల్సా సినిమాకు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేశారు. కానీ అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. అందులో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, అల్లు అర్జున్ నటించిన దేశముదురు, ప్రభాస్ నటించిన ఛత్రపతి ఈ సినిమాలకు పెద్దగా ఆదరణ లభించలేదు.

ఇకపోతే మహాశివరాత్రి కానుక ఇంకొన్ని సినిమాలను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ కాబోతున్న సినిమా లేవీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేవు. ఎందుకంటే ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ డైరెక్టర్ రిలీజ్ అప్పుడు చాలామంది చూసేసినవే. దీనిలో సలార్ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సలార్ సినిమా ఎంతటి రికార్డ్స్ ని బ్రేక్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కెరియర్ కి మంచి కం బ్యాక్ ఫిల్మైంది. అయితే ఈ సినిమా రీసెంట్ గానే నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మళ్ళీ ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తే చూస్తారా అని చాలామందికి ఒక రకమైన సందేహం.

- Advertisement -

శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయమైన సినిమా దసరా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ను సాధించింది ఈ సినిమా. అయితే ఈ సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రూవ్ చేశాయి. ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు నిఖిల్ ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా చాలా పెద్ద సినిమాలతో పాటు రిలీజ్ అయింది హనుమాన్ సినిమా. అయితే హనుమాన్ సినిమా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత 50 రోజులు పోస్టర్స్ కూడా హనుమాన్ సినిమాకి పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఇంకా థియేటర్లో కొనసాగుతుంది ఈ తరుణంలో మళ్లీ ఈ సినిమాను రీ రిలీజ్ అయినట్లు తెలుస్తుంది.

సలార్ సినిమాతో పాటుగా ప్రభాస్ అభిమానులకి ట్రీట్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన రెబల్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెబల్ సినిమాలో హై వచ్చే ఎలిమెంట్స్ ఉన్నా కూడా మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. అలానే ఈ సినిమాతో పాటు వివి వినాయక దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.

చాలామంది యూత్ కి బాగా కనెక్ట్ అయినా డీజెటిల్లు, మ్యాడ్ వంటి సినిమాలు కూడా ప్లాన్ చేశారు. ఇకపోతే గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా శివరాత్రి కానుకగా రిలీజ్ అవుతున్న గామి, భీమా సినిమాలు ఫలితం తేడాగా ఉంటే ఆడియన్స్ వీటివైపు చూస్తారు. లేదంటే కొన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చిన రెస్పాన్స్ ఈ సినిమాలుకు వస్తుందని చెప్పలేం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు