Guna: గుణ సినిమాకు సంతాన భారతి దర్శకత్వం వహించలేదా.?

ఈ సృష్టిలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చాలామందికి తెలియదు. కొన్ని కథనాలు ద్వారా, ఇంకొన్ని సినిమాల ద్వారా బయటపడతాయి. అలానే కమల్ హాసన్ నటించిన గుణ అనే సినిమా ద్వారా బయటపడ్డాయి గుణ గుహలు. గుణ గుహలు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం మలయాళం లో రీసెంట్ గా రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ అనే సినిమా. ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది కమలహాసన్ నటించిన గుణ సినిమాని రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇంకొంతమంది గుణ గుహలను సందర్శించే పనిలో పడ్డారు.

2006లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు చిదంబ‌రం మంజుమ్మెల్ బాయ్స్ మూవీని తెర‌కెక్కించాడు.
స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌ జోనర్ లో దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అనుకోకుండా గుణ కేవ్ లో చిక్కుకున్న తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సినిమా కథ.

ఈ తరుణంలో గుణ గుహలు గురించి అనేక రకాల చర్చలు మొదలయ్యాయి అసలు గుణ గుహలు ఎక్కడున్నాయి అసలు అవి ఏంటి అంటే. 2,200 మీటర్ల ఎత్తులో ఉన్న గుణ గుహలును ఇంతకుముందు ‘డెవిల్స్ కిచెన్’ అని పిలిచేవారు. 1992 తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రం “గుణ” ఈసినిమాను ఇక్కడ షూట్ చేశారు అప్పటినుండి ఈ ప్లేస్ కి ‘గుణ’ అనే పేరు వచ్చింది.

- Advertisement -

మోయిర్ పాయింట్ రోడ్డులో ఉన్న ఈ గుహలు కొడైకెనాల్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పైన్ అడవుల గుండా నడిచిన తర్వాత మీరు గుహలను చేరుకుంటారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వలన మనం వాటిలోకి వెళ్లలేకపోవచ్చు, కానీ దూరం నుంచి ఈ గుహలను చూడొచ్చు. 1821లో ఒక అమెరికన్ Mr BS వార్డ్ ఈ ఈ ప్లేస్ ను కనిపెట్టినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం, పాండవులు ఈ గుహల్లోనే ఉండి తమ భోజనం వండుకున్నారు. అయితే “గుణ” చిత్రం ఇక్కడ చిత్రీకరించబడిన తర్వాత ఈ గుహలు ప్రసిద్ధి చెందాయి. సినిమాలోని హిట్ సాంగ్ ‘కణ్మణి అన్బోడు కాధలన్’ని గుహలో షూటింగ్ చేశారు.

అయితే గుణ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వేణు ఒక సంచలమైన విషయాన్ని బయట పెట్టాడు. గుణ సినిమాకు సంతాన భారతి దర్శకత్వం వహించారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సంతాన భారతి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే గుణ గుహల్లో సంతాన భారతి లేరని, చాలా పోర్షన్స్ కమలహాసన్ దర్శకత్వం వహించాడని వేణు చెప్పుకొచ్చాడు. గుణ గుహల్లో షూటింగ్ చేయటం అనేది అసాధ్యమైన విషయం అలాంటి ప్లేస్ లో ఎక్కువ శాతం కమలహాసన్ కష్టపడి అక్కడ షూట్ ను పూర్తి చేశాడంటూ చెప్పుకొచ్చాడు వేణు.

ఇకపోతే సంతాన భారతి కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమాలో చివరగా జిమ్ ఓనర్ పాత్రలో కనిపించాడు సంతాన భారతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు