Mega prince: వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠికి తొడిగిన రింగ్ ఖరీదు ఎంతో తెలుసా..?

గత కొద్ది కాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ జూన్ 9వ తేదీ రాత్రి మెగా, అల్లు కుటుంబ సభ్యుల మరియు బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి కి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా మణికొండ లోని నాగబాబు నివాసంలో అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు తొలిసారి కలిసి నటించారు.

ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. ఆ తర్వాత ఓ వేడుకలో ఇద్దరూ మనసులో మాట పంచుకున్నారు. ఈ ప్రేమ విషయాన్నీ పెద్దలకు చెప్పగా వారు ఒప్పుకున్నారు. దీంతో వీరి నిశ్చితార్థం జూన్ 9న ఘనంగా జరిగింది. అయితే ఈ నిశ్చితార్థంలో వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠికి తొడిగిన రింగ్ గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ గా మారింది. ఈ రింగ్ విలువ రూ. 25 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం. అలాగే వరుణ్ 2 లక్షల విలువైన కుర్తా పైజామా ధరించగా.. లావణ్య త్రిపాఠి 3 లక్షల విలువైన బెనారస్ శారీ కట్టుకున్నట్లు సమాచారం

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు