Samuthirakani: బ్రో టీజర్ అప్డేట్ గురించి చెప్పిన డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో “బ్రో” అనే సినిమా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. గోపాల గోపాల తరహాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తునందువల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. దీనికి తోడు రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కూడా సాలిడ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమా సముద్ర ఖని దర్శకత్వం వహించిన వినోదయ సితం కి రీమేకే అయినా దానికి త్రివిక్రమ్ సలహాతో ఎన్నో మార్పులు చేర్పులు చేసి తెలుగులో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం కంప్లీట్ అవగా ప్రస్తుతం హైద్రాబాద్లో  ఊర్వశి రౌటేలా తో ఒక స్పెషల్ సాంగ్ తీస్తున్నారు. ఇక సముద్రఖని నటించిన విమానం సినిమా ఇటీవల విడుదల కాగా, డీసెంట్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ఆ చిత్ర ప్రమోషన్ లో సముద్రఖని బిజీ అవగా, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ బ్రో టీజర్ అప్డేట్ ఇవ్వమని అడిగాడు. దానికి సముద్రఖని బదులిస్తూ బ్రో టీజర్ కి సంబంధించిన వర్క్ ప్రాసెస్ లో ఉంది. సినిమా షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయిపొయింది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ కూడా పూర్తవగా, సెకండ్ హాఫ్ డబ్బింగ్ మిగిలి ఉంది. ఈ డబ్బింగ్ పనులు పూర్తయిపోగానే టీజర్ అప్డేట్ వస్తుంది అని చెప్పారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ఉంటుందా అని అడగ్గా, పవన్ కళ్యాణ్ కోసం 100 కథలు నా దగ్గర ఉన్నాయి. ఆయన ఎప్పడు కథ చెప్పమన్నా నేను రెడీ అన్నారు. ఇక బ్రో సినిమాను జులై28 న విడుదల అవడానికి సిద్ధం అవుతున్నందున ఇప్పట్నుంచే ప్రమోషన్లు స్టార్ట్ చేస్తే మంచిది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు