BoyapatiRapo: పచ్చని పంట పొలాల్లో క్యూట్ గా ఫోజులిస్తున్న శ్రీలీల

టాలీవుడ్ లో ఇప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే అది శ్రీలీల అనే చెప్పాలి. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో పరిచయమైన ఈ భామ ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ హీరోయిన్ అయిపోయి తెలుగులో పెద్ద పెద్ద స్టార్ లతో సినిమాలు చేసేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలను కూడా కెరీర్ బిగినింగ్ లోనే కవర్ చేస్తున్న శ్రీలీల చేతిలో ఇప్పుడు అరడజను తెలుగు సినిమాలున్నాయి. ముందుగా కన్నడలోనే సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ కి మకాం మార్చి తెలుగు హీరోయిన్ లా మారిపోయింది. తెలుగు బాగా మాట్లాడగలగడం ఈ శ్రీలీల కు ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.

మొన్నటివరకు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీ గా ఉన్న శ్రీలీల, ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కర్ణాటకలోని మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ కొన్ని ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్న చిత్ర యూనిట్ త్వరలోనే హీరో, హీరోయిన్ల మధ్య పాటను కూడా తీయనున్నారు.

ఇక ఈ షూటింగ్ గ్యాప్ లోనే శ్రీలీల అక్కడ పచ్చని పంట పొలాల్లో క్యూట్ గా ఫొటోస్ దిగి తన ఇంస్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసింది. అక్కడ దిగిన ఒక్కో పోజుకి ఒక్కో రీసన్ ఉంది అంటూ కామెంట్స్ కూడా పెట్టింది. ఇక జూన్ 15వరకు మైసూర్ లో బోయపాటిరాపో షూటింగ్ ఉంటుంది. ఈ షూట్ తో సినిమా కూడా కంప్లీట్ అయిపోయి దసరా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక శ్రీ లీల మాత్రం ఈ షూటింగ్ పూర్తికాగానే “గుంటూరు కారం” షూట్ లో పాల్గొననుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు