Balakrishna: అన్స్టాపబుల్ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది. ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో కు ఉన్న పాపులారిటీ గురించి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన అన్స్టాపబుల్ షో విజయవంతంగా రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది. బాలకృష్ణ కెరీర్ లోనే మైలు రాయి గా నిలిచిన అన్స్టాపబుల్ షో త్వరలోనే సీజన్ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు కాసేపటి క్రితమే ఆహా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

ఇప్పటి వరకు అన్స్టాపబుల్ షో లో చిన్న,పెద్ద హీరోలు అనే తేడా లేకుండా దాదాపు స్టార్స్ అందరు ఈ షో లో కనిపించి సందడి చేసారు. ఇక లేటెస్ట్ గా అన్స్టాపబుల్ సీజన్ 3 తో మరోసారి బాలకృష్ణ ఆహా వేదికగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.

ఇన్సైడ్ సమాచారం ప్రకారం దసరా కానుకగా సీజన్ 3 మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి దసరా కు రిలీజ్ అవుతుండగా, అంతలోనే అన్స్టాపబుల్ సీజన్ 3 కూడా ఆహా లో రాబోతునట్టు ప్రకటన రావడంతో బాలకృష్ణ అభిమానులలో పది రోజులలో పండగ వచ్ఛేసినట్టయింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు