Balakrishna: భగవంత్ కేసరి ఎమోషనల్ మెలోడీ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి నుంచి ఎమోషనల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మొదటిసారిగా బాలకృష్ణ తన ఏజ్ తగ్గట్టుగా ఉండే పాత్రలో ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ అందరిని ఆకట్టుకోగా, ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలోని ఉయ్యాలో ఉయ్యాలా అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేసారు.

- Advertisement -

థమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు అచ్చమైన తెలంగాణ యాసలో లిరిక్స్ అందించారు అనంత శ్రీరామ్. ఎస్పీ చరణ్ ఆలపించిన ఈ ఉయ్యాలో ఉయ్యాలా పాట భగవంత్ కేసరి సినిమాలో ప్రధానాకర్షణగా నిలవబోతుందని తెలుస్తోంది. శ్రీలీల కీ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ తో, పాటలతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న భగవంత్ కేసరి రిలీజ్ తరువాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు