Pan India Star Prabhas: రివేంజ్ ఛాన్స్ మిస్ అయిందే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ సలార్. ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా 79 రోజులు ఉంది. నిజానికి సలార్ సెప్టెంబర్ 28నే విడుదల కావాల్సింది. కానీ, ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఉండటంతో డిసెంబర్ 22కి వాయిదా వేశారు మేకర్స్. అదే రోజు రిలీజ్ కాబోతున్న డంకీ మూవీకి పోటీగా సలార్ దిగబోతుంది. ఒక వేళ ఫస్ట్ అనుకున్న డేట్‌కే సలార్ రిలీజ్ అయి ఉంటే… ఇప్పుడు బాక్సాఫీస్ పరిస్థితి మరోలా ఉండేది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడం అనేది సలార్‌కు ప్లస్‌గా ఉండేది. దీంతో రికార్డుల వేట… కలెక్షన్ల సునామి ఉండేది. అన్నింటికీ కంటే ముఖ్యంగా ప్రభాస్ రివేంజ్ సక్సస్ అయ్యేదని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్‌కు ఏం రివేంజ్ ఉందని అనుకుంటున్నారా?

ఉంది… ప్రభాస్‌కు కూడా ఒక రివేంజ్ ఉంది. అదేంటంటే… ప్రభాస్ యాక్ట్ చేసిన రాధేశ్యామ్ 2022లో మార్చి 11న రిలీజ్ అయింది. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో పాటు మరి కొన్ని కారణాల వల్ల రాధేశ్యామ్ మూవీ ఆడియన్స్‌కి రీచ్ కాలేకపోయింది.

- Advertisement -

కానీ, వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్‌లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ అనే మూవీ మాత్రం సంచలన విజయం సాధించింది. రాధేశ్యామ్ మూవీపై కంప్లీట్ డామినేషన్ చూపించింది. ఏ ఒక్క ప్రాంతంలో గానీ, ఏ ఒక్క భాషలో గానీ రాధేశ్యామ్ ప్రభావం కనిపించలేదు. దీన్ని ప్రభాస్ ఫ్యాన్స్‌ ఘోర అవమానంగా భావించారు. రివేంజ్ తప్పక ఉంటుదని కూడా అనుకున్నారు.

అలా అనుకున్నట్టే… వివేక్ అగ్నిహోత్రిపై రివేంజ్ తీసుకునే అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ముందుగానే అనౌన్స్ చేశారు. అయినా, ప్రభాస్‌కి పోటీగా వివేక్ మరోసారి తన సినిమాను దింపాడు. అదే ది వ్యాక్సిన్ వార్. అయితే, సలార్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.

ఒకవేళ సలార్, ది వ్యాక్సిన్ వార్ ఒకే రోజు రిలీజ్ అయి ఉంటే, ఈసారి ప్రభాస్ డామినేషన్ ఉండేదని. ది వ్యాక్సిన్ వార్ కి ఇప్పుడు వచ్చిన కలెక్షన్లు కూడా రాకపోయేవని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రివేంజ్ తీసుకోలేకపోయాం… కానీ, వివేక్ అగ్నిహోత్రి సినిమాకు ఇలాంటి ఫలితం రావడం మాత్రం కొంత వరకు సటిస్ఫైగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

కాగా, మొదటి రోజు నుంచే ది వ్యాక్సిన్ వార్ మూవీ డిజాస్టార్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా పెద్దగా రావడం లేదు. ఒక రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకుని ఈ సినిమా చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఆడియన్స్ ది వ్యాక్సిన్ వార్ ఉన్న థియేటర్స్ గడప తొక్కడం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు