Boyapati: మొత్తం క్రెడిట్ నీదే అంటే ఎలా బోయా – ఇక మారవా..?

బోయపాటి సినిమాలు లాజిక్ లేని రొటీన్ రొట్ట కంటెంట్, సెన్స్ లెస్ ఫైట్స్ తో వచ్చినప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. సింహ సినిమా నుండి తీసిన కథకే కొన్ని చేంజెస్ చేస్తూ అదే ఫార్మాట్లో తిప్పి తిప్పి సినిమాలు చేస్తూ వస్తున్నాడు బోయపాటి.బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ తో చేసిన స్కంద సినిమా మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి చేసిన కామెంట్స్ ట్రోలర్స్ కి స్టఫ్ అవుతున్నాయి. విషయమేంటంటే యాంకర్ అఖండ సినిమా గురించి ప్రస్తావిస్తూ తమన్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశాడని అనగా బోయపాటి స్పందిస్తూ అఖండ సినిమాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా చూడచ్చని సమాధానం ఇచ్చాడు.
అఖండ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం కొట్టేయాలని బోయపాటి ట్రై చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. గతంలో కూడా లెజెండ్ సినిమా సమయంలో మ్యూజిక్ ఉద్దేశించి మాట్లాడుతూ  క్రెడిట్ తనదే అన్నట్లు ప్రొజెక్ట్ అయ్యేలా మాట్లాడే సమయంలో అక్కడే ఉన్న దేవి మైక్ తీసుకొని బోయపాటికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు