అల్లు అర్జున్- స్నేహ రెడ్డి లు ప్రేమించి పెద్దల అంగీకారంతో 2011 లో పెళ్లి చేసుకున్నారు. ‘సింగిల్ సిట్టింగ్ లో బన్నీ పెళ్లి ఓకే చేసేసామని’ బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఫ్యామిలీకి కూడా టైం కేటాయించి ఫారెన్ టూర్లు వంటివాటికి వెళ్ళొస్తాడు. అలా అల్లు అర్జున్ మంచి భర్త, తండ్రి అనిపించుకుంటున్నాడు. అతని మంచి కొడుకు కూడా అని ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ వేడుకలో తేలింది. అయితే మంచి అల్లుడేనా అన్న విషయాన్ని ఆయన మామగారు.. స్నేహా రెడ్డి తండ్రి గారు అయిన చంద్రశేఖర్ గారిని అడిగితే ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చారు.
చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ… “అల్లుడిగా బన్నీకి నేను వందకి వంద మార్కులు వేసేస్తాను. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారు చెప్పుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుంది. చిరంజీవి గారి స్ఫూర్తితో బన్నీ కూడా చాలా కష్టపడుతున్నారు.పెళ్లి టైములో బన్నీకి మేము కట్నం ఏమీ ఇవ్వలేదు. వాళ్లకే బోలెడంత ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి ఓ లెక్కా. కట్నాలకు కూడా ఆ కుటుంబం వాళ్లు వ్యతిరేకం’ అంటూ చెప్పుకొచ్చారు.