Venkatesh : 3 రెట్లు పారితోషికం తీసుకున్న వెంకటేష్..!

‘గురు’ ‘ఎఫ్2’ ‘వెంకీ మామ’ ‘నారప్ప’ ‘దృశ్యం 2’ వంటి వరుస సక్సెస్ లతో మంచి ఫామ్లో ఉన్నారు వెంకటేష్.  మే 27 విడుదల కాబోయే ‘ఎఫ్3’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వెంకీ పారితోషికం కూడా పెంచేసినట్టు వినికిడి. ‘ఎఫ్ 2’ చిత్రానికి గాను వెంకటేష్ రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంలో వెంకీ పాత్ర చాలానే ఉంది.వెంకటేష్ సినిమాలకి సంక్రాంతి సీజన్లో ఉండే క్రేజ్ కారణంగానే ఆ మూవీ భారీ కలెక్షన్లు సాధించింది అన్నది వాస్తవం. వెంకీ ఆసన్ అంటూ ఆయన చేసిన కామెడీకి బాక్సాఫీస్ షేక్ అయ్యింది.

దీంతో ‘ఎఫ్3’ కి ఇంకో రెండు ఎక్కువగా అంటే రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట వెంకీ. సమ్మర్ సీజన్ లో వెంకటేష్ నుండీ వచ్చే కామెడీ సినిమాలకి భారీ క్రేజ్ నెలకొంటుంది.ఈ మూవీ పై కూడా చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు