‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆ ప్రాజెక్టు ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి మహేష్ తో సినిమా మొదలుపెట్టాడు త్రివిక్రమ్. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లేట్ అవ్వడం వలన త్రివిక్రమ్ మహేష్ వైపు షిఫ్ట్ అయ్యాడని ఆ టైములో అంతా అనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ అదే టైములో కొరటాల దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఎన్టీఆర్ బిజీ అయ్యి త్రివిక్రమ్ మూవీని పక్కన పెడితే ఓకే.. కానీ అదే టైములో కొరటాలతో సినిమా అనౌన్స్ చేసేసరికి ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల మధ్యలో ఏదో కోల్డ్ వార్ నడుస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు.
కానీ ఈరోజు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ను పర్సనల్ కలవడానికి వెళ్లారు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ వెళ్లి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. వీరి మధ్య ఓ గంట వరకు డిస్కషన్ కూడా జరిగింది. ఇది సినిమా కోసమా.. కదా? అన్నది పక్కన పెడితే వీరి మధ్య ఎటువంటి గొడవ లేదు.. లేదా ఉన్నా ఈ మీటింగ్ తో సాల్వ్ అయిపోయింది అనే క్లారిటీ అయితే వచ్చేసింది. పవన్, మహేష్ లతో కూడా త్రివిక్రమ్ చిర్రుబుర్రులాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసి సినిమాలు చేయడం లేదా? ఇదీ అంతే..!