Trisha : రాజకీయ నేతపై పరువు నష్టం దావా… ప్రూఫ్ తో సహా ఇచ్చిపడేసిన త్రిష

స్టార్ హీరోయిన్ త్రిష తనను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడిన అన్నాడీఎంకే మాజీ నేత ఏవి రాజుపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. తాజాగా తన లీగల్ టీం ఆయనకు నోటీసులు పంపించిన విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ త్రిషకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం దళపతి విజయ్ “లియో” మూవీలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అదే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆ మూవీ రిలీజైన తరువాత త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. త్రిషతో రేప్ సీన్ పెట్టి ఉంటే బాగుండేదని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి అభాసు పాలయ్యాడు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటన ఎదురయింది త్రిషకు.

గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి త్రిషను రీసార్ట్ కు తీసుకువచ్చాడు అంటూ అన్నాడీఎంకే మాజీ నేత త్రిషపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆయన కామెంట్స్ ను కోలీవుడ్ సినీ స్టార్స్ అందరూ ఖండించడంతో పాటు, తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేమ్ కోసం డబ్బు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఫైర్ అవుతున్నారు. ఇక త్రిష తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫేమస్ కావడానికి ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోందని, ఈ ఘటనపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించింది. తన లీగల్ టీం తదుపరి చర్యలకు దిగుతుందని ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. అన్నట్టుగానే తాజాగా త్రిష లీగల్ టీం ఏవి రాజు పై చట్టపరమైన చర్యలకు పూనుకుంది. అతనిపై పరువు నష్టం దావా కేసు ఫైల్ చేసి నోటీసులు పంపించారు. ఆ నోటీసులను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఏవీ రాజు మళ్లీ మాట మార్చే అవకాశం లేకుండా ప్రూఫ్ కూడా అందులో పొందుపరిచారు. ముఖ్యంగా ఆయన ఏఏ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారో వాటి యూట్యూబ్ లింక్స్, వెబ్సైట్ లింక్స్ కూడా అందులో యాడ్ చేశారు. ఇక తన వ్యాఖ్యలకు అర్థం అది కాదని, లేదంటే తన ఉద్దేశం మరొకటని సదరు పొలిటికల్ లీడర్ బొంకే అవకాశం లేకుండా చేశారు. మరి ఈ కేసు నెక్స్ట్ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది అనేది చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు