Relationship Tips : గాఢ ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయంలో పార్టనర్ హద్దుల్లో ఉండాల్సిందే

గాడమైన ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రేమకు కూడా హద్దులు, సరిహద్దులు ఉంటేనే మంచిది. రిలేషన్ షిప్ ఎక్కువ కాలం పాటు సంతోషంగా, సరదాగా సాగిపోవాలంటే ఎంతటి డీప్ లవ్ లో ఉన్నా సరే కొన్ని పరిమితులను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. రిలేషన్ షిప్ కు బలమైన పునాదిలా, మూల స్తంభాలుగా ఉండే కొన్ని ముఖ్యమైన బౌండరీస్ ఉంటే ఆ బంధం ఎల్లకాలం నిలబడుతుంది. మరి ఇంతకీ లవ్ లైఫ్ లో ఉండాల్సిన ఆ బౌండరీస్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

  1. పర్సనల్ స్పేస్
    సాధారణంగా ప్రేమలో పడ్డ తర్వాత ఒకరినొకరు విడిచి ఉండలేని ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ఒకరి గురించి మరొకరికి ప్రతి విషయాన్ని చెప్పేస్తుంటారు. అయితే కాలం గడిచే కొద్దీ అలా చేయడం అనేది ఎంత పెద్ద తప్పు అనేది అర్థమవుతుంది. పర్సనల్ స్పేస్ అనేదే లేకపోతే ఆ బంధం బలంగా ఉండదు. పర్సనల్ స్పేస్ తీసుకోవడం అంటే లవర్ ని ప్రేమించడం లేదని కాదు. మీరు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవిస్తున్నారని అర్థం. ప్రేమలో ఉన్నా కూడా మీ అభిరుచులను కొనసాగించడం, స్నేహితులతో కలవడం వంటివి చేయడం వల్ల ఆ బంధం టాక్సిక్ గా మారకుండా, సంతోషంగా ఉంటారు.
  2. మీరు మీరుగా ఉండడం
    సాధారణంగా లవ్ లో పడగానే మీ లవర్ కి నచ్చేలా మిమ్మల్ని మీరు మార్చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలా చేసుకుంటే మళ్లీ మీరు కోరుకున్నా కూడా మీకు నచ్చినట్టుగా ఉండలేరు. వ్యక్తిత్వం, అభిప్రాయం, ఆసక్తి, డ్రీమ్స్ అనేవి మీ లవర్ కు ఎంత ముఖ్యమైనవో మీకు కూడా అంతే ముఖ్యమైనవి అనేది గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు మరిచిపోయే విధంగా ప్రేమలో పడి వీక్ అవ్వొద్దు.
  3. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్
    ఆర్థిక విభేదాలు అనేవి విడాకులకు బలమైన కారణాలుగా మారుతాయి. డబ్బు విషయంలో బెదిరింపులు లేదా నియంత్రణ అనేది ఈ గొడవలకు కారణం అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ విషయానికి వస్తే పరస్పర అవగాహన, గౌరవంతో దీని గురించి ఓపెన్ గా చర్చించుకోవాలి. మీరు మీ లవర్ కలిసి ఖర్చులను పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం. మీ సొంత డబ్బు మీ చేతుల్లో ఉండడమే కాకుండా సురక్షితంగా ఉంటుంది. అలాగే దానిపై పూర్తి అధికారం మీదే అవుతుంది.
  4. సెల్ఫ్ రెస్పెక్ట్
    ప్రేమలో ఎప్పుడూ ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టకూడదు. మీరు అవతలి వ్యక్తిని ఎంత ప్రేమించినా కూడా వారు మిమ్మల్ని అగౌరవ పరచడం అనేది కరెక్ట్ కాదు. సాధారణంగా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాంటి సందర్భం ఎదురవుతుంది. కానీ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు వాళ్లు కావాలని బాధ పెట్టలేదని, పొరపాటున జరిగి ఉంటుందని లైట్ తీసుకుంటారు. కానీ అలా జరిగినప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.
  5. ఫ్రెండ్స్
    ప్రేమలో పడగానే ఇక ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా కేవలం లవర్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కానీ స్నేహితులు సపోర్ట్ సిస్టం అందిస్తారు. అలాగే జీవితంపై డిఫరెంట్ పర్స్పెక్టివ్ ను కలిగిస్తారు. కాబట్టి ప్రేమలో పడగానే స్నేహితులను నిర్లక్ష్యం చేయకండి. విభేదాలను స్వీకరించండి. ఈ చిన్న చిన్న బౌండరీస్ పెట్టుకుంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది. ఈ బౌండరీస్ కు కట్టుబడి ఉండడం వల్ల ప్రేమలో కూడా మీరు మీ సంబంధాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టుగా అవుతుంది. గౌరవం, విశ్వాసంతో బంధాన్ని కొనసాగించండి.
  6. Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు