Depression : ఈ టిప్స్ పాటిస్తే డిప్రెషన్ మాయం… మందుల కంటే బెటర్ రిజల్ట్

డిప్రెషన్ అనేది ఒక తీవ్రమైన మానసిక అనారోగ్యం. ఎప్పుడు చూసినా విచారంగా ఉండడం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి అంటే అది డిప్రెషన్ అని గుర్తించాలి. ప్రస్తుతం ఉన్న ఈ గజిబిజి జీవితంలో ప్రపంచంలోనే జనాభాలో ఎక్కువ శాతం మంది డిప్రెషన్ తోనే బాధపడుతున్నారు. ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం… ప్రపంచ జనాభాలో దాదాపు 3.8 శాతం మంది డిప్రెషన్ బాధితులు ఉండగా, భారత దేశంలో మాత్రం 4.5 శాతం మంది ఈ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. డిప్రెషన్ కు యాంటీడిప్రెసెంట్స్ లేదా సైకో థెరపీ, ఫార్మాకో థెరపీ వంటి చికిత్సలను సూచిస్తున్నారు సైకాలజిస్ట్ లు. అయితే వీటితోపాటు ఎక్సర్సైజ్ ను కూడా సూచిస్తే డిప్రెషన్ త్వరగా తగ్గుతుందని తాజాగా జరిగిన పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉంటామన్న విషయం తెలిసిందే. వ్యాయామం అనేది మానసిక సమస్యలకు శక్తివంతమైన ఔషధంగా పని చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా డిప్రెషన్ కు ఎక్సర్సైజ్ అనేది ఒక మెడిసిన్ లా పని చేస్తుందని అందులో బయటపడింది. డెన్మార్క్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఫిన్లాండ్ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో వాకింగ్ లేదా జాగింగ్, యోగ, స్ట్రెంత్ ట్రైనింగ్, మిక్స్డ్ ఏరోబిక్ ఎక్సర్సైజులు వ్యాయామాలు డిప్రెషన్ కు మంచి మెడిసిన్ లా పని చేస్తాయి. డాన్స్ కూడా డిప్రెషన్ లెవెల్ ను తగ్గిస్తుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ జరిపిన మరో అధ్యయనం ప్రకారం మానసిక స్థితి మెరుగుదలపై ఏరబిక్ ఎక్ససైజ్ మంచి ప్రభావం చూపిస్తుందని తేలింది. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల హ్యాపీ హార్మోన్లుగా పిలవబడే ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇది డిప్రెషన్ ను మాత్రమే కాకుండా ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేకపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఆకలి, ఆత్మవిశ్వాసం వంటివి పెరుగుతాయి.

అయితే డిప్రెషన్ ఉన్నవారు కేవలం వ్యాయామంపై మాత్రమే అతిగా డిపెండ్ అవ్వకూడదని సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ ను తగ్గించడంలో, తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి రాకుండా ఉండడంలో వ్యాయామం అనేది కీలక పాత్రను పోషిస్తుంది అనేది నిజం. అయితే డిప్రెషన్ లెవెల్ ఒక స్టేజ్ దాటిన వారికి కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు. ఇక డిప్రెషన్ తగ్గిన తర్వాత కూడా ఎక్సర్సైజులు చేయడం వల్ల మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి డిప్రెషన్ తో బాధపడేవారు ఇప్పటినుంచి వ్యాయామాలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వండి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు