Siddharth Roy : అర్జున్ రెడ్డిని నమ్ముకున్నా పనవ్వలేదు పాపం… కాపీ సినిమాకు జీరో బజ్

తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. “సిద్ధార్థ్ రాయ్” అనే మూవీతో ఈ హీరో మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే “అర్జున్ రెడ్డి” సినిమాను పోలిన కథతో దీపక్ ఎంట్రీ ఇస్తుండడంతో మొదటి సినిమానే కాపీ అంటూ గట్టిగానే విమర్శలు వినిపించాయి. అయితే ఈ మూవీ రిలీజ్ కు కేవలం మరొక రోజు మాత్రమే మిగిలి ఉండగా ఏమాత్రం బజ్ లేకపోవడం గమనార్హం.

“అతడు” సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ “సిద్ధార్థ్ రాయ్” సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన్వి నేగి హీరోయిన్ గా నటించగా, యశస్వి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి డైరెక్టర్స్ దగ్గర పని చేశారు. బోల్డ్ కంటెంట్ తో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడినా గానీ “సిద్ధార్థ్ రాయ్” టీం ప్రమోషన్స్ విషయంలో మాత్రం వెనకబడిపోయింది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు జీరో బజ్ కనిపిస్తోంది. ఈ బోల్డ్ మూవీ ట్రైలర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అందులో ఉన్న కిస్, హగ్, రొమాంటిక్ సీన్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ హైప్ ను ఉపయోగించుకోవడంలో చిత్ర బృందం ఫెయిల్ అయ్యింది. ట్రైలర్ తర్వాత హీరో, డైరెక్టర్ కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ వాటి ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించడం లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయం కూడా జనాలకు తెలియదు.

ఇక ట్రైలర్ చూడగానే “అర్జున్ రెడ్డి” సినిమాను కాపీ కొట్టారు అనే విషయం అందరికి అర్థమైపోయింది. నిజానికి “అర్జున్ రెడ్డి” సినిమా టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్. విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమాపై వచ్చిన వివాదాలు అన్ని ఇన్ని కావు. కానీ అన్ని వివాదాలను దాటుకుని ఈ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక అదే జోనర్లో “అర్జున్ రెడ్డి” మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా “సిద్ధార్థ్ రాయ్” మాత్రం ఇన్స్పిరేషన్ గా కాకుండా డిట్టో దించేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో దీపక్ ఆ సినిమాకు ఈ సినిమాకు అసలు ఎలాంటి పోలిక ఉండదని, కాకపోతే పాత్రలో మాత్రం ఎక్స్ట్రీమ్ ఇజం కామన్ గా ఉంటుందని చెప్పాడు. కానీ హీరో లుక్ మొదలుకొని, అతని కోపం, రొమాన్స్, ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు, రోడ్లపై పిచ్చోడిలా తిరగడం, కాలేజ్, లవ్ వంటి సన్నివేశాలన్నీ “అర్జున్ రెడ్డి”లో ఉన్నవే. మరోవైపు “సిద్ధార్థ్ రాయ్” బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా “అర్జున్ రెడ్డి” నుంచి కాపీ కొట్టిందే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే “అర్జున్ రెడ్డి” సినిమాకు సంగీతం అందించిన రధనే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్. అయితే ప్రస్తుతం ప్రమోషన్ల పరిస్థితి చూస్తుంటే అర్జున్ రెడ్డిని కాపీ కొట్టినప్పటికీ ఈ హీరోకు పని అవ్వలేదనిపిస్తోంది. అందరికీ హగ్గులు, కిస్సుకు అనేవి కలిసి రావు కదా. మరి రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు