Tollywood : ఈ ఇద్దరు హీరోలను స్టార్లు గా మార్చిన ఘనత కోడి రామకృష్ణదే!

టాలీవుడ్ లో శతాధిక చిత్రాల దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో సౌమ్యుడు అయిన ఈ లెజెండరీ దర్శకుడు తన సినిమాలను మాత్రం ఎప్పుడూ టెర్రఫిక్ గాతీసేవారు. ఫ్యామిలీ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చినా, అప్పట్లో ఆక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా కోడి రామకృష్ణ సినిమాలుండేవి. టాలీవుడ్ లో రెండవతరం హీరోలందరితోనూ సినిమాలు తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అందులో ఇద్దరు హీరోలను స్టార్లుగా మార్చింది కోడి రామకృష్ణే కావడం విశేషం. ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికీ తన స్టార్ డమ్ కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తుండగా, ఇంకొకరు సరైన సినిమాల్లేక ఫేడవుట్ అయ్యారు. వారెవరో కాదు ఒకరు నందమూరి బాలకృష్ణ కాగా, మరొకరు డా.రాజశేఖర్.

చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కోడి రామకృష్ణ ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, అప్పటి స్టార్ హీరోలైన ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలతో వరుస సినిమాలు తీశారు. ఈ క్రమంలో అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న బాలకృష్ణ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాడు. ఎన్టీఆర్ వారసుడు కావడం వల్ల సినిమాలు బాగానే చేస్తున్నా, సరైన హిట్లు దక్కకపోగా, సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాక వరుసగా మూడు ప్లాపులు అందుకోవడంతో బాలకృష్ణ సినీ కెరీర్ ప్రశ్నర్థకంగా మారిన సమయంలో “మంగమ్మగారి మనవడు” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చారు కోడి రామకృష్ణ. బాలకృష్ణ కెరీర్ లో ఇది మొదటి ఘనవిజయం కాగా, సోలో హీరోగా వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు ‘మంగమ్మ గారి మనవడు’తో గోల్డెన్ జూబ్లీ హిట్ అందించాడు.ఈ సినిమా కూడా ఏడాదికి పైగా ఆడడం విశేషం. ఇక ఆ తర్వాత బాలయ్యతో ‘ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, ‘బాల గోపాలడు’, ముద్దుల కృష్ణయ్య, ‘భారతంలో బాలచంద్రుడు’ వంటి చిత్రాలు చేసారు కోడిరామకృష్ణ.

ఇక రాజశేఖర్ తో కోడి రామకృష్ణ ముందుగా ‘తలంబ్రాలు’ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ సినిమా అందించాడు కోడి రామకృష్ణ. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు రాజశేఖర్. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘అంకుశం’ సినిమా రాజశేఖర్ కెరీర్ నే మార్చేసింది. అప్పటివరకు పలు ఫ్యామిలీ చిత్రాలు చేసిన రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ ని తెచ్చిపెట్టి ఇండస్ట్రీ లో ఒక స్టార్ గా నిలబెట్టింది అంకుశం సినిమా. ఈ సినిమా నుండే రాజశేఖర్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ గా మారారు. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఆహుతి, ఆవేశం, నాయకుడు వంటి చిత్రాలు వచ్చాయి.

- Advertisement -

వీళ్లిద్దరికే కాకుండా ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌ కి కూడా ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాతో కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ తెలుగులో వరుస సినిమాలు చేయగా, కోడి రామకృష్ణ తో ‘మన్నెంలో మొనగాడు’, మా ఊరి మారాజు, పుట్టింటికి రా చెల్లి’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు