Trisha: కుక్కకు కిస్సులు పెడుతూ త్రిష రచ్చ !

Trisha

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఇప్పటికీ ఎప్పటికీ గుర్తిండి పోతారు. అలా అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు హీరోయిన్ త్రిష. హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమిళనాడు రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అచ్చం తెలుగు హీరోయిన్ లాగే కనిపిస్తుంది. అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకులను 2004 సంవత్సరం నుంచి మెప్పిస్తూ వస్తోంది.

40 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ హీరోయిన్ త్రిష. 2004 సంవత్సరంలో వచ్చిన వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్గా మారిపోయింది త్రిష. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో నటించి… టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి లాంటి టాప్ మోస్ట్ హీరోల సరసన కూడా హీరోయిన్ త్రిష నటించి అందరినీ మెప్పించింది.

ఇక ఈమధ్య తెలుగులో ఎక్కువగా హీరోయిన్ త్రిష సినిమాలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే. ఇటీవల తమిళ హీరో విజయ్ సినిమాలో అలా మెరిసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో నిత్యం తన అందచందాలను ఆరబోస్తూ… అందరిని రెచ్చగొడుతూ ఉంటుంది త్రిష. ఈ తరుణంలోనే తాజాగా కుక్కపిల్లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టింది త్రిష. అంతేకాకుండా ఆ కుక్కకు కిస్సులు ఇస్తూ మరి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

Trisha krishnan latest photos with her puppy went viral

Trisha krishnan latest photos with her puppy went viral

Trisha krishnan latest photos with her puppy went viral

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు