Mrunal Thakur : కేన్స్ ఫీల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ అట్రాక్షన్ గా టాలీవుడ్ హీరోయిన్

సీతారామం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన మృణాల్ ఠాకూర్ తన సొంత పేరు కంటే సీత అనే పేరుతోనే తెలుగులో ఎక్కువ మందికి తెల్సు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా గతేడాది రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మించగా, లవ్ స్ట్రోరిస్ సినిమాలో తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ లో మరియు మరాఠీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న మృణాల్ ఠాకూర్ ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఆడిషన్ చేసాడంట, కానీ షూటింగ్ కి ఇంకా టైం ఉందని చెప్పడంతో మృణాల్ కాస్త నిరుత్సహ పడిందట, అయితే వర్క్ పట్ల ఆమె ప్యాషన్ ని గమనించిన నాగ్ అశ్విన్ అప్పుడే క్యాస్టింగ్ దశలో ఉన్న సీతారామం సినిమాలో హీరోయిన్ రోల్ అవసరం అవడంతో హను రాఘవపూడికి , నాగ్ అశ్విన్ మృణాల్ ఠాకూర్ పేరుని సజెస్ట్ చేయడంతో మృణాల్ కెరీర్ ఒక బాల్ కి రెండు సిక్స్ లు కొట్టినట్టైంది. అలా మృణాల్ ఠాకూర్ కి సీతారామం, ప్రాజెక్ట్ కే సినిమాలలో ఒకేసారి అవకాశాలు వచ్చాయి . ఆ తరువాత సీతారామం రిలీజై సూపర్ హిట్ అవడంతో మృణాల్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.

ప్రస్తుతం ఆమె తెలుగులో నాని హీరోగా వస్తోన్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నాలుగైదు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరై అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ కలర్ అవుట్ ఫిట్ తో రెడ్ కార్పెట్ పై ఎంట్రీ ఇచ్చి, తన బ్యూటీతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ ఫిలిం ఫెస్టివల్ కి తాను మొదటి సారి అటెండ్ అవుతుండటంతో ఆమె ఈ కలర్ ప్రిఫర్ చేసిందట. ఐశ్వర్య రాయ్, ఊర్వశి రౌతేలా లాంటి బ్యూటీల అందరిలోకెల్లా మృణాల్ ఠాకూరే అవుట్ ఫిటే ఇక్కడ హైలెట్ అవ్వడం విశేషం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు