Happy birthday: మంచు వారి మంచోడికి జన్మదిన శుభాకాంక్షలు

మంచు వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్. మే 20 న మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా filmify టీమ్ తరపున మంచు మనోజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇండస్ట్రీ లో పలు కాంట్రవర్సీల ఫ్యామిలీ గా ముద్ర ఉన్న మంచు ఫ్యామిలీలో మనోజ్ కి మాత్రం సౌమ్యుడిగా టాలీవుడ్ లో మంచి నటుడిగా మనోజ్ కి పేరుంది.

మంచు మనోజ్ విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ అయిన మోహన్ బాబు రెండో తనయుడు. 1983 మే 20 న జన్మించిన మనోజ్ చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తిని కనబరిచేవాడు. ఇది గమనించిన మోహన్ బాబు డైరెక్టర్ కే. రాఘవేంద్ర రావు కి చెప్పి “మేజర్ చంద్రకాంత్” చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. మోహన్ బాబు నటించిన పలు చిత్రాల్లో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు. ఇక 2004 లో “దొంగ దొంగది” చిత్రం తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మనోజ్ రాజు భాయ్, ప్రయాణం చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిందాస్, పోటుగాడు సినిమాలతో కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న మనోజ్ చివరగా 2017 “ఒక్కడు మిగిలాడు” సినిమాలో నటించాడు.

గత కొన్నాళ్లుగా పలు కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనిక రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ మధ్య “అహం బ్రహ్మాస్మి” అనే పేరుతో మంచు మనోజ్ సినిమా ఓపెనింగ్ కూడా జరుపుకుంది. కానీ లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఆ సినిమా ఆగిపోలేదని త్వరలోనే మళ్ళీ షూటింగ్ జరుగుతుందని మనోజ్ సన్నిహితుల నుండి సమాచారం అందింది. అయితే మనోజ్ బర్త్ డే రోజున ఓ కొత్త చిత్రం అనౌన్స్ అవుతుంది. అంతా కొత్త వారితో తెరకెక్కే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మే 20న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు