సెకండ్ ఇన్నింగ్స్ సక్సస్ అయ్యేనా..?

మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన సోనాలి బింద్రే, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో పరికిణిలో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ప్రిన్స్ మహేష్ బాబుకు పోటీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీని తర్వాత  సోనాలి బింద్రేకు బాలీవుడ్ కన్నా తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. 

మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, శ్రీకాంత్ ఖడ్గం సినిమాతో పాటు కింగ్ నాగార్జున మన్మధుడు సినిమాల్లో నటించి తెలుగులో స్టార్ డమ్ ను తెచ్చుకుంది. సోనాలి బింద్రే కొద్ది కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో చిరంజీవితో రెండోసారి జత కట్టింది. ఈ సినిమా తర్వాతే సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడింది. 

చాలా రోజుల పాటు క్యాన్సర్ తో పోరాడి, ఎట్టకేలకు ఈ ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న సోనాలి బింద్రే, ప్రస్తుతం సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల హిందీ డ్యాన్స్ షో, సూపర్ డ్యాన్సర్ సీజన్ 4లో గెస్ట్ గా మెరిసింది. అంతే కాకుండా సోనాలి బింద్రే ఓ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల  సమాచారం.

- Advertisement -

తారక్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట కొరటాల. 

అందుకోసం సోనాలి బింద్రేను కలిసి, స్టోరీ వినిపించాడట శివ. కథ నచ్చడంతో ఈ సీనియర్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. సోనాలి బింద్రే సెకండ్ ఇన్నింగ్స్ నిజమా..? కాదా..? అని తెలియాలంటే May 20 వరకు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు