పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ నేటితో 10 ఏళ్ళు పూర్తి చేస్తుంది. సినిమా వచ్చి పదేళ్లు పూర్తి అయినా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలోని ఒక పాటలో హరీష్ శంకర్ ఒక లైన్ పాడాడని.
మాములుగా తమ సినిమా పాటల్లో కొందరు డైరెక్టర్స్ కొన్ని లైన్స్ పాడుతారు, అందులో త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ కూడా ఉన్నారు.
ఇంకా రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా పాటల్నే పాడేస్తారు.
ఇంతకీ “గబ్బర్ సింగ్” సినిమాలో హరీష్ శంకర్ పాడిన లైన్ ఏంటి అని అనుకుంటున్నారా.?
మందుబాబులం పాటలోని “తాగుడంటే స్వర్గానికి నిచ్చెన , ఈ తాగుబోతు మారాడు ఇంకా సచ్చినా సచ్చినా” అనే లైన్ హరీష్ పాడిందే
దీనిని ట్విట్టర్ లో షేర్ చేసిన హరీష్ కి బదులుగా దేవీ రిప్లై ఇస్తూ మీరు నాకు భవదీయుడు భగత్ సింగ్ లో కూడా పాట పాడుతానని ప్రామిస్ చేసారు, ఇది ఇంకా పెండింగ్ ఉంది అంటూ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. దీనితో ఈ సినిమాలో కూడా డైరెక్టర్ స్పెషల్ సాంగ్ ఉందబోతుందని చాలామంది అభిప్రాయం.