మాజీ కెప్టెన్ తో నయన్ మూవీ..?

క్రికెటర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి రావడం కొత్తేమీ కాదు. హర్భజన్ సింగ్ తో పాటు పలువురు క్రికెటర్స్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సినిమాల్లో నటించారు. అలాగే కొంతమంది నిర్మాతలుగా కూడా మారారు. తాజా గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడని సమాచారం.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తమిళ ప్రజలకు దగ్గరైన ధోని, కోలీవుడ్ లో నిర్మాతగా లక్ ను పరీక్షించుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఓ తమిళ డైరెక్టర్ తో స్టోరీ గురించి ధోని చర్చలు జరిపాడని కోలీవుడ్ వర్గాల టాక్. స్టోరీ నచ్చడంతో, ధోని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడట.

ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో కూడా సంప్రదింపులు జరిపారట. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

- Advertisement -

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను ధోని పట్టాలెక్కిస్తాడని కోలీవుడ్ లో ప్రచారం సాగుతుంది. ఈ వార్త నిజామా..? కాదా..? తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు