హారికానే హైలైట్ ..

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఫన్ బ్లాస్ట్ గా నిలిచింది. ట్రైలర్ లో సర్ప్రైజ్ లు చాలానే ఉన్నాయి. అయితే సినిమాలో ఇంతకుమించిన సర్ ప్రైజ్ లు వుండబోతున్నాయట.

తమన్నా చేసిన హారిక పాత్ర మూవీకి మేజర్ హైలెట్ గా వుండబోతుందట. ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుందట. తమన్నా పాత్రను ఎఫ్ 2 లో కన్నా ఎఫ్3 లో అద్భుతంగా డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుందట. వెంకటేష్- తమన్నా ల మధ్య సీన్స్ హిలేరియస్ గా ఉంటాయని ఉండబోతున్నాయి.

”మన ఆశలే మన విలువలు” అంటూ ట్రైలర్ లో తమన్నా చెప్పిన డైలాగ్ తో క్యారెక్టరైజేషన్ తెలిసిపోతుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో స్టోరీలో సర్ ప్రైజ్ లు స్టార్ట్ అవుతాయట.

- Advertisement -

కాగ సినీ లవర్స్ కు డబుల్ డోస్ ఫన్ ఇవ్వడానికి ఈ సమ్మర్ సోగ్గాళ్లు ఈ 27న ప్రంపచ వ్యాప్తంగా థియేటర్స్ లలో రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు