బాలీవుడ్ గురించి నేను అలా అనలేదంటున్న మహేష్ బాబు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ జనాలకి పెద్ద విలన్ అయిపోయాడు. అది ఇప్పటి సంగతి కాదు ఎప్పటి నుండో ఉన్నదే. అందుకే అతను హిందీలో ఓ యాడ్ లో నటిస్తే అక్కడి జనాలు తిప్పికొట్టారు. సరే ప్రస్తుతానికి వచ్చేద్దాం. ‘మేజర్’ అనే చిత్రానికి మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మొన్న ఎ.ఎం.బి లో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబుకి ఓ ప్రశ్న ఎదురైంది.
బాలీవుడ్లో ఎప్పుడు స్ట్రైట్ మూవీ చేస్తారు అని. అందుకు మహేష్ ‘నేను తెలుగులో చేసిన సినిమా అక్కడ హిందీలో డబ్ అవుతుంది’ అది చాలు అంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాదు ‘నన్ను బాలీవుడ్ భరించలేదు.. తెలుగులోనే కంఫర్ట్ గా అనిపిస్తుంది’ అని కూడా మహేష్ అన్నాడు. ఇక ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ లో ‘ముంబైలో గాసిప్స్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు’ అన్నట్టు ఓ సెటైర్ వేశారు. 
 
ఇవన్నీ అక్కడి జనాలకి నచ్చలేదు. అంతే మహేష్ బాబుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మహేష్ ఈ విషయాల పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.’బాలీవుడ్ పై నేనెప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. తెలుగు సినిమాలు బాలీవుడ్ కు రీచ్ అవ్వాలి అనేది నా కోరిక. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. నాకు టాలీవుడ్ సౌకర్యంగా ఉంటుంది అని చెప్పాను.మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనేది నా ఫీలింగ్’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.   

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు