యంగ్ టైగర్ ఎన్టీఆర్
నటవిశ్వరూపం అనే పదానికి నిలువెత్తు రూపం అతడు,
కేవలం నటుడిగానే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా తారక్ కు మంచి పేరు ఉంది.
రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తారక్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపైన దృష్టిపెట్టాడు.
తారక్ కెరియర్ గురించి చెప్పాలంటే టెంపర్ సినిమాకి ముందు టెంపర్ సినిమా తరువాత అని చెప్పొచ్చు. టెంపర్ సినిమాకి ముందు తారక్ మైండ్ సెట్ వేరు, కేవలం హిట్ కొట్టిన డైరెక్టర్ తోనే సినిమాలు చేసి తన ఖాతాలో డిజాస్టర్స్ ను వేసుకున్నాడు.
“కిక్” సినిమాతో హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి తో “ఊసరవెల్లి”
“సింహా” సినిమాతో హిట్ అందుకున్న బోయపాటితో “దమ్ము”
“కందిరీగ” సినిమాతో హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ తో “రభస”
“గబ్బర్ సింగ్” సినిమాతో హిట్ అందుకున్న హరీష్ శంకర్ తో “రామయ్య వస్తావయ్యా”
ఈ సినిమాలు అన్ని తారక్ కు నిరాశనే మిగిల్చాయి.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా తరువాత వరుస సక్సెస్ లు చూసాడు తారక్. అజ్ఞాతవాసి అనే భారీ డిజాస్టర్ తరువాత కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసి “అరవింద సమేత” తో కూడా హిట్ అందుకున్నాడు తారక్.
ప్రస్తుతం ఇప్పుడు తారక్ ను రాజమౌళి సెంటిమెంట్ వెంటాడుతుంది.
ఏది ఏమైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో చేయబోయే సినిమా అప్డేట్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చేసే 31వ సినిమా అప్డేట్ ను తారక్ బర్త్ డే సందర్బంగా అనౌన్స్ చేయనున్నారు.
ఈ క్రేజీ అప్డేట్స్ తో పాటు మే 20న ఓటిటి లో “రౌద్రం రణం రుధిరం” సినిమా అందుబాటులోకి రాబోతుంది అనేది సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్సమెంట్ రావాల్సి ఉంది. ఒకేవేళ ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా అని చెప్పొచ్చు.