Head Up High: కస్టడి నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయనకి తెలుగు లో ఇదే మొదటి సినిమా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నాగచైతన్య ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్’ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఇక ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించాడు. తెలుగులో ధ్రువ తర్వాత చేస్తున్న ఆయన చేస్తున్న సినిమా ఇదే. ఇంకా ఈ మూవీలో ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ మధ్యనే విడుదలైన కస్టడీ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. నాగ చైతన్య ఇందులో చాలా కొత్తగా, ఎనర్జిటిక్ గా ఉన్నాడు. కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది.

- Advertisement -

తాజాగా కస్టడీ సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల అయింది. హెడ్ అప్ హై.. అనే టైటిల్ తో వచ్చిన ఈ సాంగ్ లో పోలీస్ యొక్క పని తీరుని గురించి లిరిక్స్ లో ఉంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాట ను రాసారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కస్టడీ సినిమాను మే 12 న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు