Salman khan :అవుట్ డేటెడ్ రీమేక్స్ ఎవరి కోసం చేస్తున్నారు ?

బాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్ సినిమాల జోరు బాగా పెరిగింది. సౌత్ లో హిట్ అయినా దాదాపు సినిమాలన్నిటిని బాలీవుడ్ లో రీమేక్ చేసి ప్రేక్షకులపైకి వదులుతున్నారు. హిట్, ప్లాప్ అంటూ ఏది కేర్ చేయకుండా రీమేక్స్ చేస్తూ పోతున్నారు. అది కూడా 1, 2 ఇయర్స్ గ్యాప్ లో వచ్చిన సినిమాలు కూడా కాదు ఏకంగా 9, 10 ఏళ్ళ డిఫరెన్స్ లో వచ్చిన సినిమాలని రీమేక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన “లాల్ సింగ్ చద్దా” మూవీ అయితే ఏకంగా 30 ఏళ్ళ కిందట వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ “ఫారెస్ట్ గంప్” సినిమాని రీమేక్ చేసారు. ఫలితంగా ఈ సినిమా అమీర్ ఖాన్ కెరీర్ లోనే మోస్ట్ డిస్సపాయింటెడ్ చిత్రంగా నిలిచింది.

ఇక విషయానికొస్తే సోమవారం సాయంత్రం సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కి జాన్ ” సినిమా ట్రైలర్ విడుదల అయింది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. వెంకటేష్ , జగపతి బాబు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా 2014 లో వచ్చిన తమిళ్ సినిమా వీరం రీమేక్. ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ , తమన్నా హీరో , హీరోయిన్ లుగా నటించారు. తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అజిత్ కెరీర్ కి చాలా ప్లస్ అయింది.

అయితే తమిళ్ తో పాటు తెలుగులోనూ వీరుడొక్కడే అనే పేరుతో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేసారు. కానీ అజిత్ కి ఇక్కడ ఫేమ్ లేని కారణంగా  ఆశింతనంతగా ఆడలేదు. అయితే ఇదే సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” అనే పేరుతో రీమేక్ చేసారు. ఆల్రెడీ డబ్ ఆయిన సినిమాని మళ్ళీ రీమేక్ ఎందుకు చేస్తున్నారు. అని ఎంత మంది చెప్పిన వినకుండా సినిమాని రిలీజ్ చేసారు. ఫలితంగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

- Advertisement -

వీరం సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ చేయడం వాళ్ళ ఉపయోగం ఏంటి ? సల్మాన్ ఖాన్ లాంటి హీరోకి కథలు దొరకట్లేదా అని సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు అంటే వేరు కానీ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలని ఓటిటిల ద్వారా చూసేస్తున్నారు. అయినా కూడా మేకర్స్ ఇంకా ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు