NTR30: అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులు స్క్రిప్ట్ వర్కింగ్ లో ఉన్న ఈ సినిమా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంత లేటుగా మొదలు కావడానికి కారణం స్క్రిప్ట్ రైటింగ్ లో మార్పు చేయాలనుకోవడమే. ఎందుకంటే RRR సినిమా తర్వాత తారక్ చేస్తున్న సినిమా కాబట్టి అభిమానులు, కామన్ ఆడియన్స్ కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు.

ఇక రాజమౌళితో చేసిన తర్వాత ఆ హీరో తర్వాతి మూవీ ప్లాప్ అవుతూ వస్తుంది. ఈ మధ్యనే రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో వచ్చిన ఆచార్య తో మరోసారి అ సెంటిమెంట్ నిజమైంది. కాబట్టి సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అదీ గాక కొరటాల శివ కూడా ఆచార్య ప్లాప్ తో చాలా డల్ అయ్యాడు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసి మీదున్నాడు.

“ఎన్టీఆర్ ఆర్ట్స్” పై కళ్యాణ్ రామ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు లో ఆమెకిదే మొదటి సినిమా. ఇక ఈ సినిమా కి సౌత్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మధ్యనే గ్రాండ్ గా ఓపెనింగ్ ని జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.

- Advertisement -

ఏప్రిల్ 1 న మొదలైన ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఏప్రిల్ 8 తో కంప్లీట్ అయ్యింది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన సెట్టింగ్ లో భారీ ఫైట్ సీన్ ను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ ని ఈ నెలాఖరు లో స్టార్ట్ చేయనున్నారు. 2024 లో ఎన్టీఆర్30 చిత్రాన్ని విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు