Sri simha: ఉస్తాద్ టీజర్ రేపే !

“మత్తు వదలరా” చిత్రంతో హీరోగా పరిచమయ్యాడు శ్రీ సింహ. కీరవాణి కొడుకు అయినప్పటికీ ఆ పేరు వాడుకోకుండా తనకంటూ ఒక గుర్తింపు రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలు చేసిన శ్రీ సింహ, మత్తు వదలరా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. “తెల్లవారితే గురువారం” , “దొంగలున్నారు జాగ్రత్తా “మూవీస్ తో టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరోగా రాణిస్తున్నాడు శ్రీ సింహ. అయితే ఈసారి ఈ యంగ్ హీరో కాస్త డోస్ పెంచి ఒక సీరియస్ యాక్షన్ డ్రామా తో మన ముందుకు రాబోతున్నాడు.

వారాహి చలన చిత్రం బ్యానర్ పై శ్రీ సింహ హీరోగా వస్తోన్న చిత్రం “ఉస్తాద్ “. నేవి బ్యాక్డ్రాప్ లో ఉండబోయే ఈ సినిమాకి ఫణిదీప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని చిత్ర యూనిట్ రేపు ఉదయం 7.36 కి విడుదల చేయనున్నారు. శ్రీ సింహకి జోడిగా బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. గౌతమ్ మీనన్ ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు.

ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి షెడ్యూల్ ని చిత్ర యూనిట్ కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన కూత రాంప్ అనే సాంగ్ కి మంచి స్పందన రావడంతో సినిమా రిసల్ట్ కూడా అలాగే ఉంటుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు.సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. మరి ఈ సినిమాతో నైనా శ్రీ సింహ మత్తు వదలరా లాంటి మంచి హిట్ మళ్ళీ కొడతాడా లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు